వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో కొత్తగా 684 కరోనా కేసులు .. 5 వేలకు చేరువగా యాక్టివ్ కేసులు

|
Google Oneindia TeluguNews

భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి . తాజాగా తెలంగాణ రాష్ట్రంలో 684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షలలో 56,122 మందికి పరీక్షలు చేయగా వారిలో 684 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు.

కరోనా మరణ మృదంగం .. తాజాగా 354 మంది మృతులు, కేసుల్లో టాప్ 10 నగరాలివే కరోనా మరణ మృదంగం .. తాజాగా 354 మంది మృతులు, కేసుల్లో టాప్ 10 నగరాలివే

గత 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మృతి

గత 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మృతి

వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా ముగ్గురు మరణించారు . దీంతో కరోనా మహమ్మారి తో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1697 కు చేరింది. కరోనా బారిన పడిన వారిలో నిన్న 394 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4,965 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా వారిలో 1873 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా సమాచారం. ఇక జిహెచ్ఎంసి పరిధిలో నిన్న ఒక్కరోజే 184 కరోనా కేసులు నమోదయ్యాయి .

ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 3,07,889 కరోనా కేసులు

ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 3,07,889 కరోనా కేసులు


ఇదిలా ఉంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 3,07,889 కరోనా కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న వారు 3,01 ,227 మంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న 1.3 శాతం మరణాల రేటు లో తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న మరణాల రేటు 0.55 శాతం. ఇక కోలుకున్న వారి రేటు భారతదేశంలో 90 4.1 శాతంగా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో 97.83 శాతంగా నమోదైనట్టు ఆరోగ్య శాఖ చెప్తుంది .

కరోనా నిబంధనలు కఠినంగా అమలు చెయ్యాలని తెలంగాణా సర్కార్ ఆదేశం

కరోనా నిబంధనలు కఠినంగా అమలు చెయ్యాలని తెలంగాణా సర్కార్ ఆదేశం

ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. మాస్కులు ధరించి గుండా బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తోంది. ఒకవేళ ఎవరైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే జరిమానాలు విధిస్తామని అటు పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
Corona cases are also on the rise in the state of Telangana. Recently, 684 corona positive cases were reported in Telangana state. Of the 56,122 people tested during the corona tests conducted until 8pm last night, 684 were infected with the corona epidemic. Three people died Of those affected by the corona, 394 recovered yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X