కుల, మతాల పేరుతో 70 ఏళ్లు వంచన : జూబ్లీహిల్స్ రోడ్ షోలో కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ : దేశంలో ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 71 ఏళ్ల నుంచి కాంగ్రెస్, బీజేపీ కుల, మతాల పేరుతో ఓట్లడిగాయని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలివ్వడం .. తర్వాత మరచిపోవడం వారికి పరిపాటిగా మారిపోయిందని విమర్శించారు. శనివారం జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ రోడ్ షో ప్రసంగించారు కేటీఆర్.

గల్లీలో .. ఢిల్లీలో ...
అధికారం వికేద్రీకరణ జరుగాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. లేదంటే నియంత పోకడలు వచ్చే అవకాశం ఉందన్నారు. గల్లీలో మనమే ఉండాలి .. ఢిల్లీలో కూడా మనమే ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రాలకు కేంద్రం .. విశేష అధికారాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించుకోవాలంటే ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలే ఉండాలని స్పష్టంచేశారు.
పరిష్కారం దిశగా ...
భాగ్యనగరంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. వచ్చే ఐదేళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటున్నందున .. సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రజల మనసులు గెలుచుకొని .. ఢిల్లీలో కూడా చక్రం తిప్పుతామని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.












Click it and Unblock the Notifications