తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు: యాక్టివ్ కేసులు కూడా, జిల్లాల వారీగా కేసులివే

హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, తాజాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కరోనా కేసులు స్వల్పగా పెరిగాయి. రాష్ట్రంలో 1,20,165 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 746 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 746 కరోనా కేసులు, 5 మరణాలు

తెలంగాణలో కొత్తగా 746 కరోనా కేసులు, 5 మరణాలు

తాజాగా, నమోదైన 746 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,37,373కు చేరింది. కరోనాతో కొత్తగా ఐదుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3764కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.

తెలంగాణలో 9,836 యాక్టివ్ కేసులు

తెలంగాణలో 9,836 యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 729 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,23,773కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,836 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 97.86 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదలల నమోదైంది.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 04, భద్రాద్రి కొత్తగూడెంలో 18, జీహెచ్ఎంసీలో 71. జగిత్యాలలో 34, జనగామలో 12, జయశంకర్ భూపాలపల్లిలో 21, జోగులాంబ గద్వాలలో 05, కామారెడ్డిలో 02, కరీంనగర్‌లో 57, ఖమ్మంలో 61, కొమురంభీం ఆసిఫాబాద్ లో 05, మహబూబ్‌నగర్‌లో 06, మహబూబాబాద్‌లో 19, మంచిర్యాలలో 48, మెదక్‌లో 05, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 32, ములుగులో 16, నాగర్ కర్నూలులో 05, నల్గొండలో 45, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 04, నిజామాబాద్‌లో 08, పెద్దపల్లిలో 51, రాజన్న సిరిసిల్లలో 27, రంగారెడ్డిలో 20, సంగారెడ్డిలో 07, సిద్దిపేటలో 22, సూర్యాపేటలో 41, వికారాబాద్ లో 05, వనపర్తిలో 08, వరంగల్ రూరల్ లో 15, వరంగల్ అర్బన్‌లో 42, యాదాద్రి భువనగిరిలో 30 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+