తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు: 6లక్షలు దాటిన రికవరీ, జిల్లాలవారీగా కేసులివే
హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది వారాలుగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలో 800కు దిగువకు వచ్చాయి. అయితే, కరోనా టెస్టులు కూడా తగ్గడం గమనార్హం. రాష్ట్రంలో 81,405 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 748 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 748 కరోనా కేసులు, 8 మరణాలు
తాజాగా, నమోదైన 748 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,20,613కు చేరింది. కరోనాతో కొత్తగా 8 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3635కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.

తెలంగాణలో 14,302 యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 1492 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,02,676కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,302 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 97.10 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేసిన నాటి నుంచి కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం గమనార్హం.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 0, భద్రాద్రి కొత్తగూడెంలో 42, జీహెచ్ఎంసీలో 121. జగిత్యాలలో 19, జనగామలో 06, జయశంకర్ భూపాలపల్లిలో 18, జోగులాంబ గద్వాలలో 06, కామారెడ్డిలో 0, కరీంనగర్ లో 50, ఖమ్మంలో 61, కొమురంభీం ఆసిఫాబాద్ లో 0, మహబూబ్‌నగర్‌లో 16, మహబూబాబాద్‌లో 29, మంచిర్యాలలో 25, మెదక్‌లో 04, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 36, ములుగులో 14, నాగర్ కర్నూలులో 10, నల్గొండలో 34, నారాయణపేటలో 06, నిర్మల్‌లో 01, నిజామాబాద్‌లో 07, పెద్దపల్లిలో 21, రాజన్న సిరిసిల్లలో 15, రంగారెడ్డిలో 49, సంగారెడ్డిలో 24, సిద్దిపేటలో 22, సూర్యాపేటలో 44, వికారాబాద్ లో 08, వనపర్తిలో 13, వరంగల్ రూరల్ లో 10, వరంగల్ అర్బన్‌లో 25, యాదాద్రి భువనగిరిలో 12 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications