టీఆర్ఎస్‌కు 100 సీట్లు.. కాదు 77: ఈ మూడు సర్వేలు ఏం చెప్పాయంటే? ఏపీలోనూ చంద్రబాబుకు దెబ్బ!

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీది గెలుపు ఖాయమంటే తమ పార్టీ గెలుస్తుందని తెరాస, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమిలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పలు సర్వేలు తెరాస వైపు ఎక్కువగా మొగ్గు చూపినప్పటికీ, ఇంకొన్ని సర్వేలు మహాకూటమి గెలుస్తుందని చెబుతున్నారు.

తెరాస నేతలు తమ ఎన్నికల ప్రచారంలో ఈ సర్వేల అంశాన్ని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా తెరాస అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన సభల్లో మాట్లాడుతూ.. జాతీయ సర్వేలు తమ వైపు మొగ్గు చూపుతున్నాయని అన్నారు. తాజాగా సోమవారం మాట్లాడుతూ 12 జాతీయ సర్వేలు తెరాస వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు.

 ఈ సర్వేల్లో తెరాస హవా

ఈ సర్వేల్లో తెరాస హవా

ఈ విషయాన్ని పక్కన పెడితే తాజాగా టీవీ9కు చెందిన సీపీఎస్ సర్వే, పోల్ ల్యాబ్ ఫైనల్ రిపోర్టు పేరుతో మరిన్ని సర్వేలు వెలుగు చూశాయి. వెలుగు చూసింది. ఈ సర్వేలలోను తెరాసకు భారీగా సీట్లు వస్తాయని తేలింది. మహాకూటమికి అందనంత దూరంలో తెరాస సీట్లు సాధిస్తాయని ఈ సర్వేలో వెల్లడైంది.

తెరాసకు 94 నుంచి 104 సీట్లు

తెరాసకు 94 నుంచి 104 సీట్లు

సీపీఎస్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితికి 94 నుంచి 104 సీట్లు, మహాకూటమికి (తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితి) 16 నుంచి 21 సీట్లు, బీజేపీకి 1 నుంచి 2 సీట్లు, మజ్లిస్ పార్టీకి 7 సీట్లు, ఇతరులకు 1 సీటు వస్తుందని ఈ సర్వేలో వెల్లడైందని చెబుతున్నారు.

తెరాసకు దాదాపు సగం ఓట్లు

తెరాసకు దాదాపు సగం ఓట్లు

అలాగే, తెరాసకు 49.7 శాతం ఓట్లు, మహాకూటమికి 32.3 శాతం ఓట్లు, బీజేపీకి 9.1 శాతం ఓట్లు, మజ్లిస్ పార్టీకి 2.4 శాతం ఓట్లు, ఇతరులకు 6.5 శాతం ఓట్లు పడతాయని సర్వేలో వెల్లడైంది.

ఈ సర్వేలో ఎన్నంటే?

ఈ సర్వేలో ఎన్నంటే?

పోల్ ల్యాబ్ ఫైనల్ రిపోర్టులో బీజేపీకి 7 (+1) సీట్లు, బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌కు 2 (+/-1), బీఎస్పీకి 1 సీటు, కాంగ్రెస్ పార్టీకి 31 (+/-2) సీట్లు, స్వతంత్రులు 5 సీట్లు, మజ్లిస్ పార్టీకి 7 (-1) సీట్లు, తెలుగుదేశం పార్టీకి 4 (+/-1) సీట్లు, తెరాసకు 65 (+/-2) సీట్లు వస్తాయని తెలింది. (+/- ప్లస్ లేదా మైనస్) ఈ సర్వేలు చూస్తుంటే చంద్రబాబు, రాహుల్ గాంధీ కూటమికి భారీ దెబ్బ పడేలా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో మహాకూటమి గెలుపు ద్వారా ఏపీలో మరింత బలం పెంచుకుందామని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ సర్వే ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కూటమి ఓడిపోతే ఏపీలో కూడా ప్రభావం పడే అవకాశముంది.

 మరో సర్వే ఏం చెప్పిందంటే?

మరో సర్వే ఏం చెప్పిందంటే?

ఈ రెండు సర్వేలు కాకుండా పల్స్ ఆఫ్ ఓటర్ అనే మరో సర్వేలోను తెరాస గెలుస్తుందని తేలింది. తెరాసకు 77 సీట్లు, బీజేపీకి 3 సీట్లు, బీఎల్ఎఫ్‌కు 2 సీట్లు, బీఎస్పీకి 2 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు, సీపీఎంకు సున్నా, స్వతంత్రులు 5గురు, మజ్లిస్ పార్టీ 7 సీట్లు, తెలుగుదేశం పార్టీ 3 సీట్లు, తెలంగాణ జన సమితికి సున్నా సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది. అయితే ఈ సర్వేలు ఎంత వరకు నిజమని విపక్షాలు అంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+