తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉన్నతాధికారుల బదిలీ జరిగింది. ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్‌గా కే సురేంద్రమోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఎల్ శివకుమార్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
బదిలీ అయిన అధికారుల వివరాలు.. ఆరోగ్యశ్రీ సీఈవోగా ఆర్.వీ. కర్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. వాణిజ్య పన్నుల డైరెక్టర్‌గా కే హరిత నియమితులయ్యారు. విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

తెలంగాణ ఫుడ్స్ ఎండీగా కే చంద్రశేఖర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. వనపర్తి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ నారాయణపేట అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. టెక్స్ టైల్స్, హ్యాండ్లూమ్స్ డైరెక్టర్ బీ శ్రీనివాస్ రెడ్డి మాతృసంస్థకు బదిలీ అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం (Sri Lakshmi Narasimha Swamy) బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ లతో పాటు ఆలయ ఈవో, అర్చకులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఫిబ్రవరి నెల 23న నిర్వహించే స్వామి వారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రికను అందించారు.












Click it and Unblock the Notifications