శంషాబాద్ విమానాశ్రయంలో 8 కిలోల బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారంనాడు భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అక్రమంగా తరలిస్తున్న సుమారు 8 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న విమానంలో ఒక ప్రయాణికుడు వద్ద రెండు కిలోల బంగారం, అదే విమానంలో మరో ప్రయాణికుడి వద్ద 1.78 కిలో గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, షార్జా నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మరో విమానంలో ఒక ప్రయాణికుడి వద్ద నుంచి 2.17 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్‌కు చేరుకున్న మరో ప్రయాణికుడి వద్ద 2.05 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా నలుగురు ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న సుమారు 8 కిలోల బంగారాన్నిసీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వారం క్రితమే 4 కిలోల బంగారం సీజ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.2.29 కోట్లు విలువైన 3743 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
కాగా, ముందస్తు సమాచారం మేరకు జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా ఇస్త్రీపెట్టె లోపల దాచుకుని తెచ్చిన 594 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణీకుడి వద్ద పోర్టబుల్ స్పీకర్, లైట్లలో దాచుకుని తెచ్చిన 1225 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుడి "లో'' దుస్తుల్లో దాచిన 1924 గ్రాముల బంగారం పేస్టు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురి నుంచి దాదాపు నాలుగు కిలోల బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు.. ప్రయాణికులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications