Snakes: పాఠశాలలో పాములు.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 కట్ల పాములు..
ప్రభుత్వ పాఠశాలలో పామలు గుంపు కనిపించిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ పాఠశాలలో జరిగింది. ముస్లాపూర్ పాఠశాలలో దాదాపు 120 మంది విద్యార్థులు చదువుతున్నారు. మంగళవారం స్వాతంత్య్రదినోత్సవం కావడంతో విద్యార్థులకు యూనీఫామ్ లు పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో ఓ విద్యార్థికి కట్ల పాము కనిపించింది. దీంతో విద్యార్థి భయంతో పాము కనిపించిన విషయాన్ని ఉపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారు.
ఉపాధ్యాయులు అక్కడి వెళ్లి చూడగా.. పాము కనిపించింది. అక్కడే ఉన్న అక్షయ పాత్ర సిబ్బింది ఆ పామును కర్రతో చంపారు. అయితే ఆ వెంటనే మరో పాము వచ్చింది. దాన్ని కూడా చంపారు. ఆ తర్వాతా మరో పాము.. ఇలా మొత్తం 8 పాములు వచ్చాయి. వీటన్నింటిని కూడా చంపేశారు. అయితే పాఠశాల అవరణలో భారీగా పాములు కనిపించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా భయపడుతున్నారు. పాఠశాలకు రావడానికి విద్యార్థులు జంకుతున్నారు.

గతంలో పాఠశాలల్లో పాములు కరిచి విద్యార్థులు చనిపోయిన సంఘటనలు కూడా జరిగాయి. కొద్ది రోజుల క్రితం వనపర్తి జిల్లా కొత్తకోటలో జరిగింది. వీపనగండ్ల గురుకుల పాఠశాలలో విద్యార్థిని పాము కాటు వేసింది. ఈ పాఠశాలలో పాన్గల్ మండలం బాద్రుగూడెంకు చెందిన మహేందర్ 10వ తరగతి చదువుతోన్నాడు.రాత్రి అన్న తిన పడుకున్న అతన్ని పాము కరిచింది. తోటి విద్యార్థులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కు సమచారం అందించారు. అయితే చాలా నిర్లక్ష్యం, బాధ్యతరహిత్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ ఏం గొడవ చేయకుండా పడుకోవాలని హుకుం జారీ చేశాడు.
దీంతో విద్యార్థులు పడుకున్నారు. అయితే ఉదయం మహేందర్ చేయిదాటిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మహేందర్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బాలుడి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications