తెలంగాణలో స్థిరంగా కరోనా కొత్త కేసులు: 12వేలకు యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా కేసులివే

హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది వారాలుగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు స్థిరంగా ఉంటున్నాయి. తాజాగా, రాష్ట్రంలో 900కు దిగువకు వచ్చాయి. మరణాలు కూడా తగ్గాయి. రాష్ట్రంలో 1,08,954 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 848 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 848 కరోనా కేసులు, 6 మరణాలు

తెలంగాణలో కొత్తగా 848 కరోనా కేసులు, 6 మరణాలు


తాజాగా, నమోదైన 848 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,26,085కు చేరింది. కరోనాతో కొత్తగా ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3684కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.

తెలంగాణలో 12,454 యాక్టివ్ కేసులు

తెలంగాణలో 12,454 యాక్టివ్ కేసులు

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 1114 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,09,947కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,454 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 97.42 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేసిన నాటి నుంచి కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా కేసులు స్థిరంగా ఉంటున్నాయి.

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

తెలంగాణలో జిల్లాలవారీగా కరోనా కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరో కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 03, భద్రాద్రి కొత్తగూడెంలో 33, జీహెచ్ఎంసీలో 98. జగిత్యాలలో 17, జనగామలో 05, జయశంకర్ భూపాలపల్లిలో 17, జోగులాంబ గద్వాలలో 04, కామారెడ్డిలో 04, కరీంనగర్ లో 46, ఖమ్మంలో 48, కొమురంభీం ఆసిఫాబాద్ లో 05, మహబూబ్‌నగర్‌లో 16, మహబూబాబాద్‌లో 31, మంచిర్యాలలో 49, మెదక్‌లో 06, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 45, ములుగులో 25, నాగర్ కర్నూలులో 10, నల్గొండలో 66, నారాయణపేటలో 06, నిర్మల్‌లో 04, నిజామాబాద్‌లో 12, పెద్దపల్లిలో 44, రాజన్న సిరిసిల్లలో 26, రంగారెడ్డిలో 42, సంగారెడ్డిలో 11, సిద్దిపేటలో 21, సూర్యాపేటలో 58, వికారాబాద్ లో 05, వనపర్తిలో 13, వరంగల్ రూరల్ లో 11, వరంగల్ అర్బన్‌లో 44, యాదాద్రి భువనగిరిలో 23 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+