ఆర్నెళ్లుగా!: బాలికలపై 85ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం.. లైంగిక వేధింపులు..
కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా డివిజన్, ప్రథమపురి కాలనీలో సత్యనారాయణ(85) అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నివసిస్తున్నాడు. ఉదయాన్నే కాప్రా ప్రభుత్వ పాఠశాలలో వాకింగ్ కు వెళ్లడం అతనికి అలవాటు.
హైదరాబాద్: వయసు మీద పడ్డా ఆ వృద్ధుడి పాడు బుద్ది మాత్రం మారలేదు. అభం శుభం తెలియని బాలికలతో కామవాంఛలు తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. నిత్యం ఇదే పని పెట్టుకున్న సదరు వృద్ధుడిని ఇటీవల షీ టీమ్స్ అదుపులోకి తీసుకోవడంతో ఈ విషయం వెలుగుచూసింది.
కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా డివిజన్, ప్రథమపురి కాలనీలో సత్యనారాయణ(85) అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నివసిస్తున్నాడు. ఉదయాన్నే కాప్రా ప్రభుత్వ పాఠశాలలో వాకింగ్ కు వెళ్లడం అతనికి అలవాటు. అయితే వాకింగ్ మాటున అతను బాలికలను లోబరుచుకునే నీచబుద్దిని ప్రదర్శించేవాడు.

పాఠశాల సమీపంలోని దుకాణానికి వచ్చే బాలికలకు చాక్లెట్ ఆశచూపించేవాడు. అలా దాదాపు 40 మంది పిల్లలకు చాక్లెట్ ఆశ చూపించి.. అందులో ఆరుగురు బాలికలకు చాక్లెట్లతో పాటు అప్పుడప్పుడు డబ్బులిస్తూ మచ్చిక చేసుకున్నాడు. బాలికలను ఇంటికి తీసుకెళ్లి లైంగికంగాను వేధించేవాడు. ఆరు నెలలుగా వారిపై వేధింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.
తన వేధింపుల గురించి ఎవరికీ చెప్పవద్దంటూ బాలికలను బెదిరించేవాడు. మంగళవారం పాఠశాలలో షీటీమ్స్ అవగాహన సదస్సు నిర్వహించగా.. విద్యార్థినులు వృద్ధుడి వ్యవహరిం గురించి వారితో చెప్పారు. దీంతో వెంటనే షీటీమ్స్ బృందం బాధితుల తల్లిదండ్రులకు సమాచారం అందించి, వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సత్యనారాయణను అదుపులోకి తీసుకొని పలు కేసులు నమోదు చేశారు. బాధితుల్లో నలుగురు విద్యార్థినులు ఎస్సీ బాలికలు కూడా ఉండటంతో.. సత్యనారాయణపై అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు అడిషనల్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. కాగా, నిందితుడి భార్య చాలా ఏళ్ల క్రితమే మరణించిందని, అతని పిల్లలు విదేశాల్లో ఉంటున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications