• search
 • Live TV
మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

98 శాతం రికవరీ, 2 శాతం మరణాలు, గోరంతను ఎందుకు కొండంత చేస్తారు, విపక్షాలపై మంత్రి కేటీఆర్

|

కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఈ సమయంలో కూడా రాజకీయాలు సరికాదన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. వీలైతే సాయం చేయాలే తప్ప ప్రభుత్వాలే విమర్శలు సరికాదన్నారు. కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి కామెంట్ చేశారు. సోమవారం పాలమూరులో మెడికల్ కాలేజీని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. తర్వాత విపక్ష నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

అగ్రరాజ్యలు సైతం..

అగ్రరాజ్యలు సైతం..

వైరస్ తెలంగాణకే పరిమితం కాదు అని.. దేశంలో, ప్రపంచలో ఉంది అని గుర్తుచేశారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా భయపడిపోతుందని చెప్పారు. కొందరు నేతలు మాత్రం కరోనా విషయంలో కేసీఆర్ ఫెయిల్ అంటున్నారని గుర్తుచేశారు. మరీ కరోనా విషయంలో పాసయ్యింది ఎవరో చెప్పాలని కోరారు. ఏ ముఖ్యమంత్రి పాసయ్యాడా.. ప్రధాని మోడీ పాసయ్యారా అని అడిగారు. కరోనా వైరస్ సోకిన దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉంటే ప్రధాని మోడీ ఫెయిల్ మరీ పాసా అని అడిగారు. విమర్శలు చేయడం మానేసి.. నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు.

కాళ్లలో కట్టె పెట్టొద్దు..

కాళ్లలో కట్టె పెట్టొద్దు..

వైరస్ నిర్మూలన కోసం ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని తెలిపారు. వీలయితే ప్రభుత్వానికి సహకరించలే కానీ.. పరుగెడుతున్న ప్రభుత్వం కాళ్లలో కట్టె పెట్టడం సరికాదన్నారు. కరోనా అనేది విపత్తు అని, అందరూ కలిసి పనిచేద్దామని సూచించారు. ప్రాణాలకు తెగించి మరీ పనిచేస్తున్న వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ప్రతిపక్షాలు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. చిన్న తప్పులను గోరంత కొండంత చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ రికవరీ రేటు 98 శాతం ఉందని.. 2 శాతం మరణాలు ఉంటే దానినే పెద్దది చేస్తున్నారన్నారు.

ఎలా కోలుకుంటున్నారు..

ఎలా కోలుకుంటున్నారు..

వైరస్ సోకిన బామ్మ గాంధీ ఆస్పత్రిలో కోలుకున్నారని.. 20 రోజుల పసికందు కూడా క్యూర్ అయ్యాడని చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్, హోం మంత్రి మహమూద్ అలీ కూడా కోలుకున్నారని చెప్పారు. మరణాల రేటు చెప్పి భయపెట్టడం కన్నా.. ఎలా కోలుకున్నారో చెబితే బాగుంటుందన్నారు. కానీ ఆ పని చేయడం లేదు అని.. విమర్శించడానికి సమయం కేటాయిస్తున్నారనితెలిపారు.

  A Boy Sleeps On Suitcase Wheeled By Mother Video Gone Viral
  ఏకో పార్క్ భేష్..

  ఏకో పార్క్ భేష్..

  దేశంలో జీవ ఔషధ రంగంలో తెలంగాణ ముందు ఉందన్నారు కేటీఆర్. వ్యాక్సిన్, డ్రగ్ తయారీలో ఇతర దేశాల మాదిరిగా పోటీ పడి పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్లాస్మా థెరపీ కూడా ఉంది.. తన నియోజకవర్గానికి చెందిన ఇద్దరు, ముగ్గురికి చేశారని తెలిపారు. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే 2700 ఎకో పార్క్ బాగుందని, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కేటీఆర్ అభినందించారు.

  English summary
  98 per coronavirus patients are recover in the state, 2 per are dead minister ktr said in mahabubnagar
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more