విషాదం: పరీక్ష బాగా రాయలేదని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని మల్రెడ్డిపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్ష సరిగా రాయలేదని మనోవేదనకు గురైన సదరు విద్యార్థి.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షరాసిన మూడు రోజుల తర్వాత చెరువులో శవమై తేలడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పెద్దెముల్ మండలం పిన్నెముల గ్రామానికి చెందిన కిష్టప్ప-మల్లమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. చిన్నవాడైన రమేష్ యాలాల మండలం మల్రెడ్డిపల్లిలో పెద్దమ్మ వద్ద ఉండి జిల్లా పరిషత్ అగ్గనూరు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల్లో భాగంగా పరీక్ష మొదటిరోజు ఏప్రిల్ 3వ తేదీన గౌతమి పాఠశాలలో పరీక్ష హాజరయ్యాడు రమేష్. తెలుగు పరీక్ష తర్వాత పరీక్ష బాగా రాయలేదని మనోవేదనకు గురయ్యాడు.

పరీక్ష సరిగా రాయని విషయాన్ని తోటి విద్యార్థులకు, కుటుంబసభ్యులకు కూడా రమేష్ చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇంట్లోనే తన హాల్ టికెట్ వదిలి రెండు రోజులు కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు యాలాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. అయితే, మూడో రోజున గ్రామం సమీపంలో ఉన్న రెడ్డి చెరువులో రమేష్ శవమై తేలాడు. రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
కాగా, పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ అంశం రాష్ట్రంలో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. వికారాబాద్ జిల్లా తాండూరులో పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. ఆ తర్వాత హిందీ పరీక్ష కూడా పరీక్ష ప్రారంభమైన కాసేపటికే వాట్సాప్ ద్వారా బయటికి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హనుకొండలో హిందీ ప్రశ్నపత్రం లీక్ కావడంతో విద్యార్థులో ఆందోళన వ్యక్తం చశారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications