స్నేహితుడి ముసుగులో 16ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్...!
సిద్దిపేట జిల్లాలో పదహారేళ్ల మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ జరిగింది. రేప్ చేసిన వారిలో మైనర్ బాలికి స్నేహితుడితో పాటు మరో ఇద్దరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. స్నేహితుడి ముసుగులో యువతిని తీసుకుని వెళ్లి, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. అనంతరం వదిలివేసి పారిపోయారు. సంఘటనపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సిద్దిపేట్ జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం రాయవరానికి చెందిన 16 ఏళ్ల యువతిపై ముగ్గరు వ్యక్తులు సాముహిక హత్యచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి గురైన అమ్మాయి తన స్నేహితుడితో కలిసి బయటికి వెళ్లింది. యువతిని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం మరో ఇద్దరు యువకుడి స్సేహితులు కలిసి అమ్మాయిని రాత్రంతా అత్యాచారం చేసి, ఉదయం రోడ్డుమీద పడేసి వారు
పారిపోయారు.
కాగా కూతురు కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు రోడ్డుపైన అపస్మారక స్థితిలో కనబడింది. వెంటనే అమ్మాయిని ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులకు అనంతరం అమ్మాయి జరిగిన విషయాన్ని వారికి వివరించింది. తల్లిదండ్రుల వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications