అప్పుడే పుట్టిన శిశువుకు దంతాలు... ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు...
అప్పుడే పుట్టిన ఓ పసిపాపకు పుట్టుకతోనే రెండు దంతాలు ఉండటం చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం(జూలై 9) ఓ మహిళ శిశువుకు జన్మనివ్వగా.. వైద్యులు ఆ పసి పాప నోట్లో దంతాలను గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
డెలివరీ కష్టం కావడంతో ఆపరేషన్ చేశామని... ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సాధారణంగా బిడ్డ పుట్టిన ఆరు నుంచి 12 నెలల్లో దంతాలు వస్తాయి. కానీ కొంతమంది శిశువుల్లో ఇలా పుట్టుకతోనే పళ్లు వస్తాయి. వీటిని నాటల్ పళ్లు అంటారు. వైద్య నిపుణుల అంచనా ప్రకారం ప్రతీ 2వేల మందిలో ఒకరికి మాత్రమే ఇలా పుట్టుకతో పళ్లు వస్తాయి. దీనికి పెద్దగా కంగారు పడాల్సిన పనేమీ లేదని వైద్యులు చెబుతుంటారు.

ఒక అంచనా ప్రకారం ఇలా పుట్టుకతోనే దంతాలతో పుట్టే శిశువుల కుటుంబాల్లో అంతకుముందు అలా పుట్టినవారు ఉంటారు. పుట్టుకతోనే దంతాలతో పుట్టే 15శాతం శిశువులు ఇలాంటి నేపథ్యం కలిగి ఉండవచ్చు. ఇందులో మగ శిశువుల కంటే ఆడ శిశువులే ఎక్కువగా ఉంటారు. నాటల్ పళ్లు మొదట్లో కాస్త కదిలినట్లుగా అనిపించినా... ఆ తర్వాత వాటి నిర్మాణం గట్టిపడుతుంది. అప్పుడప్పుడు వైద్యుడి వద్దకు వెళ్లి చెకప్ చేయించుకుంటే మంచిది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications