జనగామ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనగామలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది .. 8 గంటలపాటు చుక్కలు చూపించింది

|
Google Oneindia TeluguNews

జనగామ జిల్లా కేంద్రంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఆర్టీసీ బస్ డిపో సమీపంలో దర్జాగా చెట్టెక్కి కూర్చుని స్థానికులకు ముచ్చెమటలు పట్టించింది. పట్టుకోడానికి ప్రయత్నించిన అటవీ అధికారులను ఎనిమిది గంటలపాటు ముప్పతిప్పలు పెట్టింది.

<strong>అగ్రిగోల్డ్‌ వైఎస్‌ చైర్మన్ సదాశివ వరప్రసాద్‌ అనుమానాస్పద మృతి </strong>అగ్రిగోల్డ్‌ వైఎస్‌ చైర్మన్ సదాశివ వరప్రసాద్‌ అనుమానాస్పద మృతి

జనగామ జిల్లా కేంద్రంలో ఎలుగుబంటి హల్ చల్

ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ జనగామ జిల్లా కేంద్రంలోకి ఓ ఎలుగుబంటి వచ్చింది. తెల్లవారుజామున రోడ్లపై తచ్చాడుతున్న ఎలుగుబంటిని కొందరు యువకులు చూసి బెదిరించడంతో అది కాస్త జనగామ బస్ డిపో సమీపంలో చెట్టెక్కి కూర్చుంది. ఇక దాన్ని పట్టుకోడానికి రంగంలోకి దిగిన అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. తెల్లవారుజామున మూడు గంటల నుండి 11:30 వరకు అది చేసిన హల్చల్ అంతాఇంతా కాదు.

8 గంటలపాటు స్థానికులను , అధికారులను ముప్పతిప్పలు పెట్టిన ఎలుగుబంటి

8 గంటలపాటు స్థానికులను , అధికారులను ముప్పతిప్పలు పెట్టిన ఎలుగుబంటి

ఇక ఎలుగుబంటిని పట్టుకోడానికి వచ్చిన అధికారులు గన్ సహాయంతో ఎలుగుబంటికి రెండు మత్తు ఇంజక్షన్స్ ఇచ్చినప్పటికీ అది మత్తులోకి జారుకో లేదు. దీంతో మూడవ మత్తు ఇంజక్షన్ ఇచ్చిన అధికారులు, అది మత్తులో కింద పడకుండా వలలు ఏర్పాటు చేశారు. అది మత్తులోకి జారుకున్నట్టే జారుకుని మళ్లీ స్పృహలోకి రావడంతో కాసేపు అధికారులకు టెన్షన్ పట్టుకుంది.
మొత్తానికి చెట్టు పైనుండి కిందికి దిగుతూ పక్కనే ఉన్న గోడ మీద నుండి ఎలుగుబంటి ఆర్టీసీ డిపో లోకి చొరబడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సివిల్ ఇంజనీర్ బాబాకు ప్రాణాపాయం తృటిలో తప్పింది.

నాలుగు మత్తు ఇంజక్షన్స్ ఇస్తే గానీ పట్టుబడని ఎలుగుబంటి

నాలుగు మత్తు ఇంజక్షన్స్ ఇస్తే గానీ పట్టుబడని ఎలుగుబంటి

గంటన్నరపాటు డిపోలో తిరిగిన ఎలుగుబంటిని పట్టుకోడానికి అధికారులు తీవ్రంగా ప్రయాస పడ్డారు. నాలుగు మత్తు ఇంజక్షన్స్ ఇస్తే గాని దానిని పట్టుకోవడం అధికారులకు సాధ్యం కాలేదు. మొత్తం మీద జనగామ వాసులు భయబ్రాంతులకు గురి చేసిన ఎలుగుబంటిని పట్టుకున్న అధికారులు దానిని ఏటూరునాగారం తాడ్వాయి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఒక ఎలుగుబంటి చేసిన హంగామాతో వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఎలుగుబంటితో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

English summary
A bear created tension in the district of Jangaon. The bear sat on the tree near the RTC bus depot and threatened locals. The forest officials who tried to grab the bear were done rescue operation for eight hours. After the four injections of anesthesia bear grabbed into a cage. Forest officials have left the bear in the forest area .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X