తెలంగాణ బాలుడి కిడ్నాప్, ఏపీలో సజీవ దహనం: అసలేం జరిగింది?

నల్గొండ/కృష్ణా: ఇటీవల కిడ్నాపైన నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి గాయం నాగార్జునరెడ్డి సోమవారం మృతి చెందాడు. మూడు రోజుల క్రితం పాఠశాల నుంచి అదృశ్యమై కృష్ణాజిల్లా చిల్లకల్లు వద్ద కాలిన గాయాలతో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అతడ్ని చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జునరెడ్డి పరిస్థితి విషమించడంతో అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

అసలు ఏం జరిగింది..

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు శివారులో మూడు రోజుల క్రితం విద్యార్థి నాగార్జున పెట్రోల్‌ మంటల్లో కాలిపోతూ కనిపించిన ఘటన సంచలనం రేపింది. అనేక అనుమానాలకు తావిస్తున్న ఈ సంఘటనపై ఏపి, తెలంగాణ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

A boy allegedly burnt alive

కాగా, చిల్లకల్లు శివార్లలోని పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది.. శనివారం ఉదయం 11 గంటల సమయంలో మంటల్లో కాలిపోతూ కేకలు పెడుతున్న బాలుడిని చూసి మంటలను ఆర్పి 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఆ బాలుడు తన తండ్రి ఫోన్‌ నంబర్‌ చెప్పడంతో 108 సిబ్బంది కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.

నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం కొత్తూరుకు చెందిన బాలుడి తండ్రి నాగిరెడ్డి, బంధువులు ఆస్పత్రికి వచ్చారు. పోలీసుల సమాచారం మేరకు జగ్గయ్యపేట న్యాయమూర్తి బి శ్రీనివాసు వచ్చి బాలుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బాలుడిని విజయవాడకు తరలించారు.

నాగార్జునరెడ్డి హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల వసతిగృహంలో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థులు రూ.500 దొంగతనం చేశావంటూ నిందించడంతో మనస్తాపానికి గురై చనిపోతున్నానంటూ గురువారం సాయంత్రం లేఖరాసి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. దీనిపై తల్లిదండ్రులు హుజూర్‌నగర్‌ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.

విద్యార్థి రాసిన లేఖ ప్రతులను బంధువులు శనివారం పోలీసులకు అప్పగించారు. అయితే పాఠశాల నుంచి బాలుడు బయటకు రాగానే కొందరు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి నల్ల కారులో చిల్లకల్లు శివారులోకి తీసుకొచ్చి పెట్రోల్‌ పోశారని నాగార్జున్‌రెడ్డి తన వాంగ్మూలంలో చెప్పినట్లు బంధువులు పేర్కొంటున్నారు.

కాగా, ఆ బాలుడ్ని చిల్లకల్లు శివారుకు ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? ఆ బాలుడ్ని పెట్రోలు పోసి చంపాల్సిన అవసరం ఎవరికుంది? అనే ఎన్నో అనుమానాలున్న ఈ ఘటనను ఇరురాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+