Street Dogs Attack: కంచన్ బాగ్‍లో దారుణం.. పిల్లాడిపై వీధి కుక్కల దాడి.. విషమంగా బాలుడి ఆరోగ్యం..!
తెలంగాణలో వీధి కుక్కలు దాడులు ఆగడం లేదు. ప్రజలపై దాడుల చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటికే వీధి కుక్కల దాడిలో ఇద్దరు పిల్లలు ప్రాణాలు విడిచారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ అంబర్ పేటలో ప్రదీప్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. తండ్ర పని చేస్తున్న కారు సర్వీస్ సెంటర్ కు కొడకును తీసుకురాగా.. బాలుడి కుక్కలు దాడి చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల వైరల్ అయిన సంగతి తెలిసిందే.
వారం రోజుల క్రితం కాజీపేటలో ఓ బాలుడిని వీధి కుక్కలు కరిచి చంపాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సునీత, మల్కాన్ దంపతులు అజ్మీర్ వెళ్లేందుకు తమ కుమారుడు చోటూతో కాజీపేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. చోటూ బహిర్భూమి కోసం పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఆరు వీధి కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి చెందాడు.

తాజాగా హైదరాబాద్ లోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఆర్ డీఓ టౌన్‌షిప్‌లో ఐదు కుక్కలు మూడేళ్ల బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
వెంటనే గమనించిన చుట్టుపక్కల వారు బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలుడు ట్యూషన్ నుంచి ఇంటికి విస్తుండగా ఈ ఘటన జరిగింది. వీధి కుక్కలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
వీధి కుక్కలు హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలో చాలా చోట్లు ప్రజలను గాయపరుస్తున్నాయి. ఐదు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం వెంకయ్య తండా, మేఘ్య తండాలలో 14 మందిపై వీధి కుక్కల దాడి చేశాయి. అంతకు ముందు మెదక్ జిల్లాలో ఓ ఏడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో చిన్నారిని హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కలను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications