అర్ధరాత్రి అమ్మకాలు: మంత్రి తలసాని సోదరుడి బార్‌పై కేసు

హైదరాబాద్: నగరంలోని మోండా మార్కెట్‌ ప్రాంతంలోని తెలంగాణ మంత్రి తలసాని సోదరుడి బార్‌పై సోమవారం రాత్రి మార్కెట్‌ పోలీసులు దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని విక్రయిస్తున్నట్లుగా అబ్కారీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోండా మార్కెట్‌ పరిధిలోని గ్యాస్‌ మండీ, ఆదయ్యనగర్‌ ప్రాంతంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సోదరుడు శంకర్‌యాదవ్‌కు శివ బార్‌ ఉంది.

రాత్రి పది గంటల తర్వాత మద్యాన్ని విక్రయిస్తున్నట్లుగా ఉత్తరమండలం డీసీపీ ప్రకాష్‌రెడ్డికి సమాచారం అందింది. దీంతో ఆయనతో పాటు పలువురు ఇన్‌స్పెక్టర్లు సోమవారం రాత్రి శివ బార్‌పై దాడి చేశారు.

A case filed at Talasani Srinivas Yadav's brother's bar

అనుమతులకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. డీసీపీ ఆదేశాల మేరకు మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ శివమారుతీ.. బార్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

మద్యం దుకాణాలు బంద్

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో హోలీ సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ఉత్తర్వుల జారీ చేశారు.

22వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలపై అంక్షలు విధించారు. కల్లు దుకాణాలు, వై న్స్‌లు, బార్‌షాపులు మూసివేయాలన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమై నచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+