జీవన్ రెడ్డికి మరో షాక్: చేవెళ్లలో భూ కబ్జా కేసు నమోదు
ఆర్మూర్‌లోని మాల్ అండ్ మల్టీప్లెక్స్ రీ ఓపెన్ అయిన సమయంలోనే బీఆర్ఎస్ మాజీ జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. జీవన్ రెడ్డితోపాటు అతని కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశారు. సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నారు. దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది. దీంతో 2023లో అక్కడున్న ఫంక్షన్ హాల్‌ను కూల్చేసిన జీవన్ రెడ్డి ఆ భూమిని కబ్జా చేశారు.

కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్‌ను కాపలాగా పెట్టారు. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డిపై పంజాబ్ గ్యాంగ్ దాడికి పాల్పడింది. మరణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని భయభ్రాంతులకు గురించేంది. ఈ క్రమంలో ఘటనపై తాజాగా చేవెళ్ల పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో జీవన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది ఇలావుంగా, ఇటీవలే అద్దె బకాయిలు రూ. 2.50 కోట్లు డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలోని జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్‌ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. షాపింగ్ మాల్ గేటుకు తాళం వేశారు ఆర్టీసీ అధికారులు. షాపింగ్ మాల్ లో ఉన్న దుకాణదారులను బయటకు పంపించేశారు. అయితే, తాజాగా, హైకోర్టు ఆదేశాలతో ఆ మాల్ తిరిగి ఓపెన్ అయ్యింది. వారంలోగా ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications