కి‘లేడీ’ ఖతర్నాక్ స్కెచ్: పెప్పర్ స్ప్రే చల్లి.. రూ. 16లక్షలు, బంగారం చోరీ
హైదరాబాద్: బాకీ చెల్లిస్తామని ఇంటికి పిలిచి ఓ వ్యక్తి నుంచి భారీగా సొత్తు కాజేసిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి డీఐ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంబర్‌పేట మున్సిపల్ క్వార్టర్స్ నివాసిగట్టు ప్రకాశ్ స్థానికంగా చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
ప్రకాశ్ వద్ద బాగ్ అంబర్‌పేట భరత్‌నగర్‌కు చెందిన శ్రీదేవి, సురేష్ దంపతులు చిట్టీలు వేశారు. అయితే ప్రకాశ్ చిట్టీ డబ్బులు ఇవ్వలేదు. కొంతకాలంగా చిట్టీ తాలుకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రకాశ్‌ను అడుగుతున్నారు. మార్చి 27న మధ్యాహ్నం ప్రకాశ్ దంపతులు ఫోన్ చేసి డబ్బుల విషయం మాట్లాడుదామని ప్రకాశ్‌ను ఇంటికి రప్పించారు.
అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి దాడి చేసి ఇంట్లో బంధించారు. అనంతరం శ్రీదేవి ప్రకాశ్ వద్ద సెల్‌ఫోన్‌ను లాక్కోని అతని భార్య రజితకు తాము ఇన్‌కమ్‌టాక్స్ అధికారులమని, నీ భర్త ప్రకాశ్ మావద్ద ఉన్నాడని, ఇద్దరు మనుషులను మీ వద్దకు పంపుతున్నామని, ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు, డాక్యుమెంట్లు వారికి ఇచ్చి పంపించమని మేసెజ్ పంపించింది.

ఇది నమ్మిన రజిత ఇంటికి వచ్చిన శ్రీదేవి మనుషులైన మాదిశెట్టి ప్రదీప్, మరో వ్యక్తికి 40తులాల బంగారు నగలు, రూ. 40లక్షలు, ఇంటి డాక్యుమెంట్లు ఇచ్చింది. ప్రసాద్ వాటిని తీసుకొని రావడంతో సురేష్ దంపతులు ప్రకాశ్‌ను సాయంత్రం వదిలిపెట్టారు. ఇంటికి వచ్చిన ప్రకాశ్‌కు భార్య రజిత జరిగిన విషయం చెప్పింది.
శ్రీదేవి, సురేష్ దంపతుల బెదిరింపులకు భయపడిన ప్రకాశ్ ఫిర్యాదు చేయలేదు. కొద్ది రోజుల తరువాత తిరిగి శ్రీదేవి ప్రకాశ్‌కు ఫోన్లు చేస్తూ.. మరో 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని, వాటిని వెంటనే ఇవ్వాలని లేనిపక్షంలో చంపుతామని బెదిరించారు.
దీంతో బుధవారం ప్రకాశ్ అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు శ్రీదేవి, సురేష్ దంపతులు,ప్రసాద్‌లపై కేసులు నమోదు చేసి, వారి కోసం గాలిస్తున్నారు. కేసును అంబర్‌పేట ఎస్‌ఐ విజయ్‌భాస్కర్ దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications