క్రెడిట్ కార్డ్ వేధింపులు: బిల్లు చెల్లించలేక దంపతులు ఆత్మహత్య
మేడ్చల్: జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్‌కు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిజానికి సురేశ్ స్వస్థలం లాలాపేట్, అతని భార్య భాగ్యది మారేడ్‌పల్లి.
సురేష్ దంపతులు కీసరలో స్థిరపడ్డారు. ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై, శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకి కారణం క్రెడిట్ కార్డ్ అధికారులు అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టారు.

క్రెడిట్ కార్డు సంబందించిన అధికారులు ఇంటికి వచ్చి బిల్లు కట్టమని ఇబ్బంది పెట్టడంతో, స్థానికంగా ఉన్న ఇరుగు పొరుగు ముందు తమ పరువు పోయిందనీ మానసికంగా ఇబ్బంది పడినట్లు సూసౌడ్ నోట్లో పేర్కొన్నారు. తమ పిల్లలను బంధువుల ఇంటికి పంపి, ఈ దారుణానికి పాల్పడ్డారు సురేష్ దంపతులు.
క్రెడిట్ కార్డు అధికారుల వేధింపుల తాళలేక దంపతులు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలంగా మారింది. సదరు అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రాణాలు తీసుకునేలా వేధింపులకు పాల్పడతారా? అని మండిపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications