మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు, అరెస్ట్
హైదరాబాద్: వైద్యం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన ఓ యువతికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించాడో దుర్మార్గపు వైద్యుడు. ఈ ఘటన తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బాధితురాలి బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లాల్‌బజార్‌లో ఉండే సదరు యువతి (20) సోమవారం సాయంత్రం చర్మ వ్యాధికి సంబంధించి స్థానికంగా ఉండే గీత నర్సింగ్ హోంకు వెళ్లింది.
ఆస్పత్రిలో ఉండే వైద్యుడు గణేష్.. ఇంజక్షన్ ఇస్తానని చెప్పి ఆమెను బెడ్‌పై పడుకోబెట్టాడు. ఆమె చేతికి ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే మత్తులోకి జారుకుంది. అనంతరం ఆమె శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. తన కళ్లముందు జరుగుతున్న సంఘటనలు గుర్తిస్తున్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సత్తువలో అచేతనంగా ఉండిపోయింది.

కొద్దిగా శక్తిని కూడదీసుకున్నాక తన కుటుంబసభ్యులు, మిత్రుడికి ఫోన్ చేయడంతో అతను హుటాహుటిని ఆస్పత్రికి చేరుకున్నాడు. అతను వెళ్లేసరికి కుర్చీలో ఆ యువతి కుర్చీలో నీరసంగా పడిపోయి ఉంది. ఆమె సెల్‌ఫోన్ కూడా కిందపడిపోయి ఉంది.
ఏం జరిగిందని ప్రశ్నించిన మిత్రుడికి ఆమె జరిగిన ఘటనను వివరించింది. కాగా, అమ్మాయి నీరసంగా ఉండటంతో ఇంజక్షన్ ఇవ్వగా నిస్సత్తువలోకి జారుకుందని డాక్టర్ బుకాయించేందుకు ప్రయత్నించాడు. అయితే తనకు మత్తు ఇంజక్షన్ ఇచ్చాక శరీరంపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించినట్లు యువతి తన మిత్రుడికి తెలిపింది.
దీంతో ఆగ్రహానికి గురైన బాధితురాలి బంధువులు వైద్యుడ్ని చితకబాదారు. ఆ వెంటనే బాధితురాలిని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు తిరుమలగిరి పోలీసులు, నిందితుడు గణేష్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications