ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్: పెళ్లి చేసుకుంటానని ఒకడు, ఫొటోలతో బెదిరించి మరొకడు

కరీంనగర్‌: జిల్లాలోని గోపాల్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కరీంనగర్‌ గ్రామీణ సీఐ నరేందర్‌ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు.

గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన యువతి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. నగరంలోని మరో ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మానకొండూర్‌ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన నల్ల రాహుల్‌(18) సెల్‌ఫోన్ కాల్ ద్వారా అయిదు నెలల కిందట ఆమెకు పరిచయమయ్యాడు.

A girl allegedly gangraped in Karimnagar

శనివారం సాయంత్రం నగరంలో ట్యూషన్‌కంటూ గ్రామం నుంచి వచ్చిన యువతిని రాహుల్‌.. ద్విచక్రవాహనంపై రేకుర్తిలో తన స్నేహితుడు సాయిచరణ్‌(18) ఇంటికి తీసుకువెళ్లాడు. రాహుల్‌ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

కాగా, సాయిచరణ్‌ తన సెల్‌ఫోన్‌లో ఫొటోలు ఉన్నాయంటూ బెదిరించి ఆ యువతిపై అత్యాచారం చేశాడు. ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో రాహుల్‌ యువతిని ఇంటి వద్ద వదిలిపెట్టేందుకు ద్విచక్రవాహనంపై తీసుకెళుతుండగా తీగలగుట్టపల్లె వద్ద రాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.

విషయం తెలుసుకున్న యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై సామూహిక అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నిర్భయ కేసులు నమోదు చేశారు. యువకులను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+