మహిళపై అత్యాచారయత్నం: బాలికపై రేప్

మహబూబ్‌నగర్/కరీంనగర్: మహబూబ్‌నగర్‌ మండలం రాంచంద్రాపురంలో మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఓ యువకుడు ఆమె ప్రతిఘటించడంతో దాడి చేసి పరారయ్యాడు. దీనిపై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు మహబూబ్‌ నగర్‌ రూరల్‌ పోలీసులు నిందితుడు సంపత్‌పై అత్యాచారయత్నంతో పాటు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు నల్లగొండ జిల్లా దేవరకొండలో ఆరేళ్ల బాలికపై బీహార్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి షహర్‌ మున్నీసా అత్యాచార యత్నం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు విద్యార్థికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. షహర్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

A girl allegedly raped by a youth

ఏడేళ్ళ బాలికపై యువకుడి అత్యాచారం

కరీంనగర్‌: ఏడేళ్ళ చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన కరీంనగర్‌ శివారులోని చింతకుంటలో గురువారం చోటు చేసుకుంది. నీరటి సునీల్‌ అనే యువకుడు ఎదిరింట్లో ఉన్న ఇద్దరు పిల్లలను ఆడిస్తానని వారి తల్లి వద్ద నుంచి తీసుకుపోయాడు. తెలిసిన యువకుడేనని భావించిన తల్లి ఐదేళ్ల కొడుకుతో పాటు ఏడేళ్ల కూతురును అతడితో పంపించింది.

ఇద్దరిని గదిలోకి తీసుకెళ్లిన యువకుడు బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక అరుపులతో అక్కడే ఉన్న బాలిక తమ్ముడు ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో యువకుడు పిల్లవాడిని బుజ్జగించేందుకు యత్నంలో ఉండగా బాలిక తప్పించుకుని తల్లి వద్దకు చేరింది. జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు, బంధువులు యువకుడిని పట్టుకునేందుకు యత్నించారు.

అప్పటికే యువకుడు తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనపై గురువారం రాత్రి బాలిక తల్లిదండ్రులు కరీంనగర్‌ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+