విషాదం: స్కూల్ బస్సు నుంచి పడి చిన్నారి మృతి, నిర్లక్ష్యమే కారణం
హైదరాబాద్: నగర శివారులోని వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి ఒకటో తరగతి విద్యార్థిని మృతి చెందింది. బస్సులో ఆయా గానీ, సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లేందుకు శనివారం ఉదయం అంజలి అనే విద్యార్థిని ఆ బస్సు ఎక్కింది. వేగంగా నడిపిన బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బస్సులోంచి కిందపడిపోయింది అంజలి.

ఈ ప్రమాదంలో చిన్నారి తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అంజలి మృతిచెందిందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంజలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా, బస్సులు ఆయా గానీ, సెక్యూరిటీ గార్డు గానీ లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే అంజలి మృతి చెందిందని చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం స్కూల్ బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
పిల్లల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్కూల్ యాజమాన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంజలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications