హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్తి కోసం పిన్ని చిత్రహింసలు, మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించిన బాలిక

తనకు పిన్ని నుండి ప్రాణహని ఉందంటూ ఓ బాలిక మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ఆస్తిని కాజేసేందుకు పిన్ని తనను చిత్రహింసలపాల్జేస్తోందని ఆమె మానవ హక్కుల సంఘాన్ని కోరింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:తనకు పిన్ని నుండి ప్రాణహని ఉందంటూ ఓ బాలిక మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ఆస్తిని కాజేసేందుకే పిన్ని తనను చిత్రహింసలపాల్జేస్తోందని ఆమె మానవ హక్కుల సంఘాన్నికోరింది. తనకు రక్షణ కల్పించాలని ఆ బాలిక కోరింది.

ముంబాయి జోగేశ్వరి ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక అలీనా ఖాన్ తల్లి దండ్రులు రెండేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలీనా ఖాన్ తండ్రి సలీం ఖాన్ మార్బుల్ వ్యాపారం చేసేవాడు. అయితే తాను కూడబెట్టిన కోట్ల రూపాయాల ఆస్తిని అలీనా ఖాన్ పై రాశాడు.

అయితే ఆస్తి మొత్తం అలీనా ఖాన్ పేరు మీద ఉన్న విషయాన్ని అలీనా ఖాన్ పిన్ని ఆర్జియా గుర్తించింది. దీంతో ముంబాయిలో ఉన్న బాలికను రెండేళ్ల క్రితం బెంగుళూరుకు తీసుకు వచ్చింది.

A girl compliant against her aunty to human right commission

బాలిక పేరు మీద ఉన్న ఆస్తిని కాజేసేందుకు పన్నాగం పన్నింది. ఇందులో భాగంగానే అలీనా ఖాన్ ను వేదిస్తోంది. ఆ బాలికను చిత్రహింసలు పెడుతోంది.

పలుమార్లు ఆ బాలికపై హత్యయత్నానికి పాల్పడింది.అయితే ఇది భరించలేని ఆ బాలిక ఫేస్ బుక్ ద్వారా తన స్నేహితడి సహయాన్ని కోరింది.

ఆ స్నేహితుడి సహయంతో హైద్రాబాద్ నగరానికి చేరుకొంది.న్యాయం కోసం పౌరహక్కుల ప్రజా సంఘం అధ్యక్షురాలు ప్రముఖ న్యాయవాది జయ వింధ్యాలను కలిశారు. ఈ ఏడాది ఆగష్టు నిండితే ఆ బాలిక మేజర్ కానుంది.

ఆ బాలిక మేజర్ అయ్యే వరకు రక్షణ కల్పించాలని జయ వింధ్యాల మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించింది. తన ఆస్తి కోసం చిత్రహింసలకు గురిచేసిన తన పిన్ని ఆర్జియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ బాలిక కోరుతోంది. ఆ బాలికకు రక్షణ కల్పించాలని హెచ్ ఆర్ సి పోలీసులను ఆశ్రయించింది.

English summary
A girl compliant against her aunty to human right commission on tuesday.she has approached human rights commission with the help of advocate jaya vindhyala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X