జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లాడతానంటూ మోసం: పియ్రుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుని ఇంటి ముందు ప్రియురాలి కోట అనూష ఆందోళన చేస్తూ... దీక్షకు కూర్చున్న సంఘటన గురువారం జరిగింది.

|
Google Oneindia TeluguNews

పెద్దపల్లి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుని ఇంటి ముందు ప్రియురాలి కోట అనూష ఆందోళన చేస్తూ... దీక్షకు కూర్చున్న సంఘటన గురువారం జరిగింది. మండలంలోని గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన ఆమె అదే గ్రామానికి చెందిన ఉడక క్రాంతి గత నాలుగు సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వాళ్లిద్దరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంటిలో తెలియటంతో ఆమె తల్లిదండ్రులు కుల సంఘం పెద్దమనుషులను కలిశారు.

పెద్ద మనుషులు వారి ఇరువురిని పిలిచి పంచాయితీ నిర్వహించగా క్రాంతి ఆమెను పెళ్లి చేసుకోవానికి అండగీకరించాడు. ఈ క్రమంలో అమ్మాయి తల్లి దండ్రులు వారి ఇంటికి వెళ్లి పెళ్లి తేదిని ఖరారు చేయానికి వెళ్లగా, అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో ఆమె ఆందోళన చెంది అతని ఇంటి ముందు దీక్షకు దిగింది. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తాళం వేసిన ఇంటి ముందు బైఠాయించింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె కుటుంబానికి గౌడ సఘం నాయకులు బాసటగా ఉంటామని తెలిపారు.

A girl protests at her lover's house in goureddy peta

వివాహిత హత్య కేసులో నలుగురి అరెస్టు : పరారీలో ఒకరు

జనగామ: ఫిబ్రవరిలో గుండాల మండలం సీతారంపురంలో చోటుచేసుకున్న వివాహిత హత్య కేసును పోలీసులు చేధించారు. వివాహితను అదనపు కట్నం పేరుతో సొంత అత్తమామ భర్త, భర్త సోదరుడు (బావ) మరో బంధువు కలిసి ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు పేర్కొన్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ సంజీవరావు స్థానికంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గుండాల మండం సీతారంపురం గ్రామానికి చెందిన గుజ్జ కొమురయ్య తన కుమార్తె ఉమను ఇదే మండలం బ్రాహ్మణపల్లికి చెందిన జల్లి సురేష్‌కు ఇచ్చి 2015 ఫిబ్రవరి 22న వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ. 5 లక్షల కట్నం ఇచ్చారు. కొంతకాలం కాపురం సజావుగానే సాగినప్పటికీ అదనంగా మరో రూ. 4 లక్షల కట్నం తేవాలని వేధించడం ప్రారంభించారు.

పెద్ద మనుషులతో పంచాయితీ సైతం నిర్వహించినా, వేధింపులు తగ్తలేదు. ఈనెల 13న భర్త సురేష్‌, భర్త సోదరుడు వెంకటేశ్‌లు అదనపు కట్నం తేవాలని ఉమ మానసికంగా, శారీరకంగా హింసించారు. అదే రోజు రాత్రి ఉమ నిద్రించిన తర్వాత భర్త సురేష్‌, బావ వెంకటేష్‌, అత్తామామలు సుజాత, మల్లేశ్‌, అత్త సోదరుడు గవ్వల కుమారస్వామి ఆమెకు చీర కొంగుతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

ఘటన జరిగిన మరుసి రోజు భర్త సురేష్‌, బావ వెంకటేష్‌లు పరారయ్యారు. మృతురాలి తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు 14 గుండాల మండల పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ సంజీవరావు నేతృత్వంలో పోలీసులు మృతురాలి అత్తిం వారిని విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. మృతురాలి భర్త సురేష్‌, బావ వెంకటేశ్‌, అత్తామామలు సుజాత, మల్లేశ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కుమారస్వామి పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇద్దరు రైతుల సజీవ దహనం

జగిత్యాల: ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకుని వేర్వేరు ఘటనల్లో ఇద్దరు రైతులు సజీవ దహనమయ్యారు. పంట చేనులో చెత్తను తగలబెడుతుండగా ఆ మంటల్లో పడి వారు దుర్మరణం చెందారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట శివారులో సంత ఆదిరెడ్డి(80) గురువారం మధ్యాహ్నం తన పంట చేనులో చెత్త తగులబెడుతుండగా నలువైపులా మంటలు వ్యాపించాయి.

దీంతో తన చేను పక్కనున్న మరో రైతుకు చెందిన మామిడితోటకు మంటలు విస్తరించకుండా ఆర్పే ప్రయత్నంలో పడిపోయాడు. దీంతో నిప్పంటుకొని మంటల్లో కాలి మృతి చెందాడు. సైదాపూర్‌ మండలం ఘణపూర్‌ గ్రామానికి చెందిన శివరాత్రి కుమార్‌(40) గురువారం రాత్రి పంట పొలంలో చెత్తను తగులబెడుతూ ప్రమాదవశాత్తు అదే మంటల్లో చిక్కుకుని దుర్మరణం పాలయ్యాడు. ఒక్కసారిగా గాలి వీయడంతో మంటలు వ్యాపించి కుమార్‌కు అంటుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

English summary
A girl protested at her lover's house in goureddy peta, in Jagtial district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X