హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

priyanka reddy murder: ఢిల్లీలో భారీ నిరసనలు, పార్లమెంటు ఎదుట యువతి ఆవేదన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున ప్రధాన నగరాల్లో నిరసనలు చేపడుతున్నారు. నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

 Priyanka Reddy murder: నిర్భయ తర్వాత శంషాబాద్ ఘటనే: చట్టాల మార్పుపై కిషన్ రెడ్డి</a><a class=" title=" Priyanka Reddy murder: నిర్భయ తర్వాత శంషాబాద్ ఘటనే: చట్టాల మార్పుపై కిషన్ రెడ్డి" /> Priyanka Reddy murder: నిర్భయ తర్వాత శంషాబాద్ ఘటనే: చట్టాల మార్పుపై కిషన్ రెడ్డి

ఢిల్లీలో నిరసనలు

దేశ రాజధానిలో కూడా యువత భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పార్లమెంట్ స్ట్రీట్‌లో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సురక్షితంగా ఉండలేమా?

తమకు రక్షణ లేదా? అంటూ ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. ఢిల్లీకి చెందిన అను దూబే అనే యువతి పార్లమెంటు ముందు నిరసన చేపట్టారు. ‘నేను ఎందుకు సురక్షితంగా ఉండలేను' అన్న ప్లకార్డులను పట్టుకుని పట్టుకున్నారు. శనివారం పార్లమెంటు సమీపంలోని పేవ్‌మెంట్‌పై కూర్చుని నిరసన తెలిపారు.

విసిగిపోయాం.. బాధగా ఉంది..

మహిళలపై అత్యాచారం, లైంగిక దాడుల జరుగుతున్న వార్తలు వినీ వినీ అలిసిపోయాను. అందుకే నిరసన తెలియజేస్తున్నా. మా పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించాలనుకుంటున్నానని అను దూబే చెప్పారు. తనతోపాటు దేశంలో పుట్టిన ఆడ పిల్లలందరికీ రక్షణ కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. భారతదేశంలో పుట్టినందుకు బాధ పడాల్సిన పరిస్థితి వస్తోందని ఆమె వాపోయారు. అయితే, నిషేధిత ప్రాంతంలో ఆమె నిరసన చేపట్టడంతో ఆమెను పోలీసులు అక్కడ్నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను విడుదల చేసినట్లు తెలిపారు.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested
చర్లపల్లి జైలుకు నిందితులు

చర్లపల్లి జైలుకు నిందితులు

శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని లారీ డ్రైవర్ తోపాటు మరో ముగ్గురు క్లీనర్లు సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. అయితే, నిందితులను వెంటనే ఉరితీయాలని, లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం భారీ ఎత్తున ప్రజలు గుమిగూడి నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు. అక్కడ్నుంచి నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.

English summary
A girl sits on solitary protest outside Parliament over crimes against women
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X