మహిళా టెక్కీపై కారంపొడి చల్లి, గార్డు దాడి
హైదరాబాద్: నగరంలోని ఓ ఐటి కంపెనీలో పని చేస్తున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అక్కడే పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు కారంపొడితో దాడి చేశాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలోల్లికి వెళితే.. మాదాపూర్‌లోని రహేజా మైండ్ స్పేస్ ఐటి పార్కులోని బిల్డింగ్ నెంబర్-2లో ఉన్న ఓ ఐటి కంపెనీలో బాధిత యువతి(21) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది.
శనివారం విధులకు వచ్చిన ఆమె రాత్రి 10.30గంటల ప్రాంతంలో కంపెనీ ఆవరణలోనే మెట్లపై కూర్చుని వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ తెరిచి భోజనం చేస్తోంది. అదే కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న అస్సాంకు చెందిన దాస్.. కారంపొడిని ఆమెపై చల్లి దాడి చేసేందుకు ప్రయత్నించాడు.

అప్రమత్తమైన సదరు యువతి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న ఇతర ఉద్యోగులు అక్కడి చేరుకుని దాస్‌ను పట్టుకున్నారు. ఆ తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేశారు. నిందితుడు దాస్ మానసిక పరిస్థితి సరిగా లేకనే దాడి చేసి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
గొంతునులిమి భార్య హత్య
హైదరాబాద్ నగరంలోని నేరేడ్‌మెట్ పరిధి కాకతీయనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భార్య పెరికోళ్ల శ్రీకళ(27)ను శ్రీకాంత్ అనే వ్యక్తి సోమవారం ఉదయం గొంతునులిమి చంపాడు. హత్యానంతరం సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications