TS High Court: సీబీఐ విచారణ అవసరం లేదు.. హైకోర్టుకు తెలిపిన ఏఏజీ..

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఎమ్మెల్యేల కొనగోలు వ్యవహారంపై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్(ఏఏజీ) తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. పిటిషనర్‌కు ఎమ్మెల్యేల కొనుగోలుతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ఇలాంటి అంశాలపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులను కోర్టు ముందు ప్రస్తావించారు. బీజేపీ వైపు నుంచి కర్ణాటక మాజీ ఏజీ వాదనలు వినిపించారు. ఇదంతా టీఆర్‌ఎస్‌ పక్కా ప్లాన్‌తో చేసిందన్నారు. పోలీసుల తీరు సరిగా లేదన్నారు.

సుప్రీం కోర్టులో

సుప్రీం కోర్టులో


ఇదే కేసులో సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదే వేసింది. హైకోర్టులో ఈ కేసు విషయంలో విచారణ కొనసాగుతున్నందున వాయిదా వేస్తునట్లు ధర్మాసనం పేర్కొంది. కాగా ఈ విషయంపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టలో ప్రమాణం కూడా చేశారు.

నలుగురు ఎమ్మెల్యేలు

నలుగురు ఎమ్మెల్యేలు


రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్‌, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధి కొన్ని ఆడియోలు లీక్ అయ్యాయి. సీఎం ఓ వీడియోను కూడా విడుదుల చేశారు.

సీబీఐ

సీబీఐ


ఈ కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్థానిక పోలీసులతో విచారణ జరిపించాలని భావిస్తోంది. కేసు విచారణ ప్రారంభ దశలోనే ఉందని, ఇప్పుడు సీబీఐకి ఇవ్వడం సారికాదని ఏఏజీ హైకోర్టుకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+