Vemulawada: వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్..
శ్రావణ మాసం కావడంతో తెలంగాణలోని పలు దేవాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల వాహనాలతో వేములవాడలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనాలతో వేములవాడ నుంచి కరీంనగర్ , హైదరాబాద్ వెళ్లే మార్గాలు నిండిపోయాయి. సిరిసిల్ల నుంచి వేములవాడకు వచ్చే దారిలో ఎక్కడికక్కడ వాహనాలు స్ట్రక్ అయిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అటు ఆలయంలో రాజన్న దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. భక్తులక అధికారులు ఏర్పాట్లు చేశారు. మూలవాగు వంతెన పై వందలాది వాహనాలు ఆగి ఉన్నాయి. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వేములవాడలో రోడ్లు చిన్నగా ఉండడమే ట్రాఫిక్ జామ్ కారణమని భక్తులు చెబుతున్నారు. ప్రభుత్వం వేములవాడలో ఎలాంటి అభివృద్ధి చేయాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంల సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు.

అటు కొండగట్టులో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అంజన్న దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. వేములవాడ రాజన్న దర్శనం అనంతరం చాలా మంది భక్తులు కొండగట్టుకు వెళ్తున్నారు. అక్కడి నుంచి ధర్మపురి వెళ్లి గోదావరి స్నానాలు చేస్తున్నారు. వేములవాడ, కొండగట్టుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కాకుండా.. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, మెదక్, హైదరాబాద్ నుంచి భక్తులు వస్తుంటారు.
ఇటు కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం మల్లన్నను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అటు యాదాద్రిలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు వచ్చారు. తెలంగాణలోని చాలా దేవాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అటు తిరుమలలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని 84,449 మంది భక్తులు దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications