యాదగిరిగుట్ట లాడ్జీలో ఉరివేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
దరాబాద్: నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోని ఎస్‌ఆర్ లాడ్జిలో ఓ ప్రేమజంట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులను హైదరాబాద్ మీర్‌పేటకు చెందిన మధుకర్‌రెడ్డి(27), దేవి(25)గా గుర్తించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
సోమవారం లాడ్జీకి వచ్చిన ప్రేమజంట మంగళవారం ఉదయం ఎంతసేపైనా తలుపులు తీయకపోవడంతో లాడ్జీ యాజమాన్యానికి అనుమానం వచ్చింది. దీంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా వారిద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నారని లాడ్జీ యజమాని తెలిపారు.
తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదనే నెపంతోనే ఆ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.

గోదావరిలో దూకి వ్యాపారి ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లికి చెందిన కిరాణా వ్యాపారి తిరుమలేశ్వరప్రసాద్(40) మంగళవారం ఉదయం గూడెం గోదావరినదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రసాద్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఇటీవల వైద్య పరీక్షల్లో కేన్సర్ ఉందని తేలడంతో మనస్తాపానికి గురయ్యాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ బాధతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని వారు చెప్పారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.












Click it and Unblock the Notifications