సూసైడ్ నోట్ రాయించుకుని భార్య హత్యకు కుట్ర: బంధువులపై కత్తితో దాడి
హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను సుమారు 18 నెలలుగా ఇంట్లో నిర్బంధించిన ఓ దుర్మార్గుడు.. ఆమెతో సూసైడ్ నోట్ రాయించుకుని హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. విషయం తెలుసుకుని వచ్చిన భార్య బంధువులపై కత్తితో దాడి చేశాడు.
వివరాల్లోకి వెళితే.. బండ్లగూడలో ఉంటున్న మహ్మద్ గౌస్ అనే వ్యక్తికి సయ్యద్ ఫాతిమాతో వివాహమైంది. పెళ్ళయినప్పటి నుంచీ అదనపు కట్నం కోసం ఫాతిమాను వేధిస్తున్న గౌస్, ఆమెను ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు.
చివరికి స్థానికుల సాయంతో బయటపడిన ఫాతిమా ఒక స్వచ్ఛంద సంస్థ చొరవతో చాంద్రాయణగుట్ట పీఎస్‌లో తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి భర్త పెడుతున్న హింస, వేధింపులపై ఫిర్యాదు చేసింది.

అంతకుముందు గౌస్ అరాచకాలను నిలదీసినందుకు వెళ్లిన ఫాతిమా తల్లిదండ్రులు, బంధువులపై గౌస్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
ఖమ్మం: పాల్వంచ మండలం బంజార గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులు చందు(8), చరణ్(8). చిన్నారుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications