ప్రియురాలితో పెళ్లి చేయాలని.. సెల్‌ టవర్‌ ఎక్కాడు

వరంగల్: తమ ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని కరీమాబాద్‌లో చోటుచేసుకుంది. యువకుడు గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో టవర్ ఎక్కినట్లు తెలిసింది.

ఒకవేళ ఎవరైనా బలవంతంగా తనను కిందకు దించేందుకు ప్రయత్నిస్తే టవర్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు బెదిరింపులకు గురిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మధిరలో ఇద్దరు కొడుకులతో సహా తండ్రి ఆత్మహత్య

A man allegedly climbed a cell tower for marriage with his girlfriend

ఖమ్మం జిల్లా మధిర రైల్వేస్టేషన్ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి తన ఇద్దరు కొడుకులతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

మృతులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపన్నపల్లి వాసులుగా సమాచారం. మృతులు వెంకటరమణ, అశ్రుద్(10), అవిజ్ఞ(7)గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+