అక్రమ సంబంధం, చెప్పినా విన్లేదు: వదినను చంపేశాడు
వదినను బండతో మోది దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం వరంగల్ రూరల్ జిల్లా తూము బోడు వద్ద చోటు చేసుకుంది. అక్రమ సంబంధం వద్దన్నా వినకపోవడంతో హత్య చేశాడు.ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశ
వరంగల్: వదినను బండతో మోది దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామ శివారులోని తూము బోడు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, కుంటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన పఠాన్ సలీమా(30).. భర్త యాకూబ్ అనారోగ్యం కారణంగా నడవలేని స్థితిలో ఉండటంతో కిరాణ దుకాణం నడుపుతోంది.
దీని ద్వారా వచ్చిన డబ్బుతోనే ఇద్దరు కుమారులు, అత్తామామలతో సహా కుటుంబాన్ని పోషిస్తోంది. సలీమా కొంత కాలంగా తన చెల్లెలి భర్త పఠాన్ లాలూతో సన్నిహితంగా ఉంటోంది. సలీమా ఇటీవల గ్రామంలోని మరో వ్యక్తితో సన్నిహితంగా మెలగటం గమనించిన లాలూ వద్దని ఆమెతో పలు మార్లు తగవు పడ్డాడు.

మంగళవారం కిరాణం సామాను తీసుకొస్తానని ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరిన సలీమాను వెంబడించిన లాలూ.. ఆమెను వూర చెరువు తూము బోడుకు తీసుకెళ్లాడు. ఇతరులతో సాన్నిహిత్యం వద్దని ఆమెను హెచ్చరించాడు. సలీమా.. లాలూ హెచ్చరికలను ఖాతరు చేయక వ్యతిరేకించడంతో బండతో తలపై కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు.
మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న డీసీపీ ఇస్మాయల్, ఏసీపీ శోభన్‌కుమార్, పర్వతగిరి సీఐ సత్యనారాయణ, సంగెం ఎస్సై దీపక్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
మృతురాలికి ఇద్దరు కుమారులు అఫ్రిది(13), అజీద్ (9)తో పాటు వృద్ధులైన అత్తామామలు ఉన్నారు. నెక్కొండకు చెందిన షేక్ హైదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడు లాలూను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పర్వతగిరి సీఐ సత్యనారాయణ తెలిపారు.












Click it and Unblock the Notifications