మనువరాలితో పెళ్లి చేయలేదని తాతను చంపేశాడు
హైదరాబాద్: మనవరాలిని ఇచ్చి పెళ్లి చేయలేదని కోపంతో ఓ యువకుడు ఆమె తాతను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హిమాయత్‌సాగర్ (ఎపీఈఆర్‌ఎల్) ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో జనవరి 3న జరిగింగి. ఈ హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం....కాచిగూడలో నివాసముండే అబ్దుల్ ఖయ్యూం (60), వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. జమ్మూకాశ్మీర్‌లో అతని కూతురు, మనువరాలు, అల్లుడు ఉంటున్నారు. ఏడాది క్రితం కాచిగూడకు వచ్చిన మనువరాలిని చూసి అదే బస్తీ పక్కవీధిలో ఉంటున్న మహ్మద్ ఇర్ఫాన్ ఖాన్ మోజుపడ్డాడు. దీంతో అప్పటి నుంచి ఖయ్యూంతో చనువుగా ఉండటం, అతని అవసరాలకు అప్పుడప్పుడు డబ్బులివ్వటంతో ఇద్దరు స్నేహితులుగా మారిపోయారు.
ఈ నేపథ్యంలో ‘నీ మనువరాలిని పెళ్లి చేసుకుంటాను. ఎలాంటి కట్నం వద్దని నచ్చజెప్పాడు' ఇర్ఫాన్ ఖాన్. అంతేగాక కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్ ఖాన్.. ఖయ్యూంతో కలిసి జమ్ముకాశ్మీర్‌కు వెళ్లివచ్చాడు. పెళ్లి ఎప్పుడు చేస్తావ్ అంటూ ఖయ్యూంపై ఒత్తిడి తేవడంతో విషయం జమ్ముకాశ్మీర్‌లో ఉంటున్న తన కూతురుకు చెప్పాడు ఖయ్యూం.

పెళ్లి ఆలోచన ఏమిలేదని ఆమె తండ్రికి చెప్పింది. ఇర్ఫాన్‌కు ఈ విషయం చెప్పకుండా కాలం వెల్లదీశాడు ఖయ్యూం. ద్వేషం పెంచుకున్న ఇర్ఫాన్ జనవరి 3న అబ్దుల్ ఖయ్యూంను తన కారులో కూర్చోబెట్టుకొని ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా హిమాయత్‌సాగర్ చేరుకొన్నాడు. డ్రైవింగ్ సరదా ఉన్న ఖయ్యూంను కారు నడిపించు.. తాను పక్కనే కుర్చోంటానని నమ్మించాడు. ఔటర్‌పై నుంచి సర్వీసు రోడ్డుపైకి రావడంతో ఇర్ఫాన్ వేగాన్ని పెంచాలని చెప్పి.. డోర్‌తీసి కిందకు దుకాడు. అబ్దుల్ ఖయ్యూం సైతం దూకేశాడు.
గాయాలపాలైన ఖయ్యూంను ఇర్ఫాన్ కారులోని ఇనుపరాడ్‌తో తలపై గట్టిగా కొట్టి చంపేశాడు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రికరించేందుకు ప్రయత్నించాడు. అనంతరం అక్కడి నుంచి కారుతో పారిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురై చనిపోయినట్లు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమారం కోసం ఉస్మానియా మార్చూరికి తరలించారు.
అయితే పోస్టుమార్టంలో హత్య చేసినట్లు తేలడంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే ఖయ్యూం అదృశ్యమైన కేసుగా కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో నమోదై ఉంది. అనంతరం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాగా ఇర్ఫాన్ హత్యచేసి పారిపోయినట్లు తేలింది. నిందితుడుఅదుపులోకి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ గంగారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications