మగ వ్యభిచారుల పేరిట మోసం: లక్షల్లో టోకరా
హైదరాబాద్: మగవ్యభిచారులుగా సేవలందించి.. రూ. లక్షల్లో సంపాదించండి అంటూ ఆన్‌లైన్‌లో పలువురు యువకులను మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, ఎస్‌బిఐ ఏటిఎం కార్డును స్వాధీనం చేసుకున్నామని క్రైం డిసిపి రవివర్మ తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ‘మగ వ్యభిచారులు(మేల్ ఎస్కార్ట్స్) సర్వీసెస్' పేరిట నిందితుడు కనకబోయిన వరప్రసాద్ 8నెలల నుంచి ఆన్‌లైన్లో ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఫోన్, మెయిల్ ద్వారా సంప్రదించిన యువకులకు అందంగా ఉంటేనే అవకాశాలిస్తామంటూ చెప్పడం, వారు రాగానే నెలకు 3 నుంచి 4సార్లు వినియోగదారుల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని చెబుతాడు.

అంతేగాక వెళ్లిన ప్రతిసారీ రూ. 5వేల నుంచి రూ. 7వేల వరకూ ఆదాయం వస్తుందని, ఇందులో 20శాతం తమ సంస్థకు ఇవ్వాలని వరప్రసాద్ వారికి వివరించేవాడు. పేరు నమోదు చేసుకునేందుకు రూ. 5వేల నుంచి 7వేల వరకూ చెల్లించాలని చెప్పడంతో.. అతని మాటలు నమ్మి నెల రోజుల వ్యవధిలో 150 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
పేర్లు నమోదు చేసుకున్న వారితో ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా కలవడం కుదరదని, అంతా ఫోన్ ద్వారానే పూర్తవ్వాలని షరతు విధించేవాడు. డబ్బు చెల్లించిన అనంతరం ఆ ఫోన్ నంబరును మార్చేసేవాడు. ఇటీవల సిసిఎస్‌లో ఏర్పాటైన నిఘా బృందం పోలీసులు ఈ వ్యవహారంపై కూపీలాగారు.
వరప్రసాద్ ఆన్‌లైన్లో ఉంచిన నెంబర్లను సేకరించి నిఘా పెట్టారు. రెండు రోజుల క్రితం వరప్రసాద్ ఆచూకీ లభించడంతో ఇన్ స్పెక్టర్ రాజు, కానిస్టేబుళ్లు విజయ్, మురళీలు రహస్యంగా వెంటాడి శనివారం నిందితుడు వరప్రసాద్‌ను అరెస్ట చేశారు.












Click it and Unblock the Notifications