Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Online Games: ఆన్‍లైన్ గేమ్స్ ఆడి డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి.. వేధింపులు పెరగడంతో ఆత్మహత్య..

కొందరు పేకాటకు బానిసవుతారు.. మరి కొందరు మద్యానికి బానిసవుతారు. ఇంకొందరు బెట్టింగ్ లకు బానిసవుతుంటారు. కొంత మంది ఆన్ లైన్ గేములకు బానిసలవుతుంటారు. ఇలా ఆన్ గేములకు బానిసలై లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. నెల రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లికి చెందిన ఓ వివాహిత ఆన్ లైన్ గేమ్స్ ఆడి రూ.లక్షల్లో నష్టోపోయింది. దీంతో ఆత్మహత్య్ చేసుకుంది. గొల్నేపల్లికి చెందిన అవిశెట్టి మల్లేశంకు అతని భార్య రాజేశ్వరీ, కుమారులు, అనిరుధ్, హర్షవర్ధన్ ఉన్నారు.

మల్లేశం లారీ డ్రైవర్ గా పని చేస్తుండడంతో వారు చౌటుప్పల్ లోని మల్లికార్జునగర్ లో వారు ఇల్లు అద్దెకు తీసుకుని నివాసిస్తున్నారు. మల్లేశం లారీ డ్రైవర్ కావడంతో ఎక్కువగా బయటే ఉండేవాడు. దీంతో రాజేశ్వరీ పిల్లలతో ఉండేది. ఈ క్రమంలో రాజేశ్వరి తన ఫోన్ లో ఆన్ గేమ్స్ ఆడాడం అలవాటు అయింది. ఆమె ఏడాదిగా ఆన్ లైన్ గేమ్ లకు బానిసై.. దాదాపు రూ.8 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. అప్పులిచ్చిన వారు ఇంటి పైకి వచ్చారు. దీన్ని అవమానంగా భావించిన రాజేశ్వరి తన కుమారును నీటి సంప్ లో వేసి.. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది.

A man from Patancheru lost money by playing online games

తాజాగా.. ఆన్​ లైన్​ గేమ్స్‌‌‌‌ ఆడి డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు లోని శ్రీరాంనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన రావుల రవికుమార్ స్థానికంగా ఉండే ది బెస్ట్ ఫర్నీషింగ్ షాప్‌‌‌‌లో సేల్స్ మెన్‌ గా పని చేస్తున్నాడు‌‌‌. ఈ క్రమంలో ఫోన్ లో ఆన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం ఆన్ లైన్ యాప్స్‌‌‌‌లో, తెలిసిన వ్యక్తుల నుంచి అప్పులు తీసుకున్నాడు. ఆ డబ్బుతో ఆన్ లైన్ గేమ్స్ ఆడాడు. అయితే డబ్బంతా పోయింది. మరోవైపు అప్పులిచ్చిన వారు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేశారు.

ఇటు లోన్ యాప్ వేధింపులు పెరిగాయి. మనస్తాపం చెందిన రవి రెండు రోజులు ఇంట్లో ఎవరితో మాట్లాడడం లేదు.. ఎవరు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు. విషయం తెలుసుకున్న భార్య, రవి సోదరుడు రవితో మాట్లాడారు. అప్పులు ఏదో విధంగా చెల్లిద్దాం.. ఏ బాధపడకని చెప్పారు. అయితే రవి ఆదివారం ఉదయం 9 గంటలకు బయటకు వెళ్లి సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదు. భార్య అతని కోసం వెతకుతుండగా.. రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసంది. రవి తను పని చేసే షాపులోనే ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+