ప్రియుడితో భర్తను చంపించి.. అదృశ్యమయ్యాడని ఫిర్యాదు, వివాహేతర సంబంధం కోసం దారుణం
హైదరాబాద్: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. అంతేగాక, చివరికి ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్ నగర పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపించింది భార్య.

వివాహేతర సంబంధంతో గొడవలు
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ కేసులో ముగ్గురు నిందితులను అమీన్‌పూర్ పోలీసుల అరెస్ట్ చేశారు. డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీకి చెందిన వెంకటప్ప(39) చందానగర్ శివారు గంగారంలో తన భార్య పద్మ(27), ఇద్దరు పిల్లలతో ఉంటూ కూలీ పనిచేస్తున్నాడు. కాగా, పద్మకు పక్కనే నివసించే సెంట్రింగ్ పనిచేసుకునే అబ్దుల్ రహమాన్(35)తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. రహమాన్‌తో కలిసి ఉండటం చూసి భార్య పద్మను మందలించాడు భర్త వెంకటప్ప.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి.

అక్రమ సంబంధం కోసం భర్త హత్యకు ప్రియుడితో కలిసి కుట్ర
ఈ నేపథ్యంలో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని నిర్ణయించుకుంది పద్మ. తన ప్రియుడు రహమాన్‌తో కలిసి భర్త హత్యకు కుట్రపన్నింది. తనతో సెంట్రింగ్ పనిచేసే సుభాష్(30)తో కలిసి ఫిబ్రవరి 8న రహమాన్ చందనాగర్ అడ్డా వద్ద ఉన్న వెంకటప్ప వద్దకు వెళ్లి కూలీ పని ఉందని చెప్పాడు. ముగ్గురు కలిసి బైక్‌పై కొల్లూరు వెళ్లారు. అక్కడ పనిలేదని ఆలూర్ వెళ్లి వెంకటప్ప, సుభాష్ మద్యం సేవించారు. అక్కడ్నుంచి అమీన్పూర్ చక్రపురికాలనీలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. బాగా మద్యం తాగించి బండరాయితో వెంకటప్ప తల, ముఖంపై మోది హత్య చేసి పరారయ్యారు రహమాన్, సుభాష్.

ప్రియుడితో చంపించి.. భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు
తనపై ఎలాంటి అనుమానం రాకుండా పద్మ తన భర్త కనిపించడం లేదంటూ చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, ఫిబ్రవరి 10న అమీన్పూర్ చక్రపురికాలనీలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పద్మ ఫిర్యాదు ఆధారంగా ఆ మృతదేహం వెంకటప్పదేనని గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో హత్య కేసును ఛేదించే పనిలో పడ్డారు. చందానగర్ అడ్డా వద్ద సీసీఫుటేజీని పరిశీలించారు. పద్మ కాల్ డేటా ఆధారంగా కేసు ఛేధించారు. పద్మతోపాటు రహమాన్, సుభాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నిందితులపై నమోదు చేశారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ శ్రీనివాసులు రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఇతర సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications