దారుణం: శృంగారానికి సహకరించడం లేదని భార్యను హత్య చేశాడు
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ దుర్మార్గుడు.. తనకు ఇష్టమైన రీతిలో శృంగారానికి సహకరించడం లేదనే నెపంతో కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం అన్నారం గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన ఢిల్లీ రామకృష్ణ గత కొన్నాళ్లుగా ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేశాడు. అనంతరం షాద్‌నగర్ పట్టణంలో రెడిమేడ్ బట్టల షాపు నడుపుతూ జీవనం సాగిస్త్తున్నాడు.
అదే గ్రామానికి చెందిన జ్యోతి(23) అనే యువతిని రెండున్నర సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదటి నుంచి కుటుంబసభ్యులతో వేరుగా ఉంటున్న రామకృష్ణ పెళ్లి అనంతరం కూడా వేరుగానే కాపురం పెట్టాడు. భార్య, భర్తలు ఇద్దరు కలిసి షాద్‌నగర్ పట్టణంలో ఉన్న సొంత బట్టల షాపులో విధులు నిర్వహిస్తుండేవారు.

ఈ క్రమంలో షాద్‌నగర్ వెళ్లి వచ్చిన దంపతులు గురువారం రాత్రి ఇంట్లో పడుకున్నారు. మరునాడు ఉదయం 9 గంటలు గడిచినా ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తోటి కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు కొట్టారు. దీంతో కన్నీరు పెడుతూ తలుపు తీసిన రామకృష్ణ జ్యోతిని హత్యచేశానని తెలిపాడు.
హత్య సమాచారం తెలుసుకున్న షాద్‌నగర్ సీఐ శంకరయ్య సంఘటన స్థలానికి చేరుకొని జ్యోతి మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జ్యోతి మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కాగా, రామకృష్ణ మానసిక ఆరోగ్య పరిస్థి బాగాలేదని, శృంగారంలో జ్యోతి తనకు సహకరించనందునే తలను గోడకు బాది హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని సీఐ శంకరయ్య తెలిపారు. భార్యను గొంతు నులిమి, తలను గోడకు బాది కిరాతకంగా హత్య చేశాడని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని సీఐ తెలిపారు.












Click it and Unblock the Notifications