హైదరాబాద్‌లో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య
హైదరాబాద్ నగరంలో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 7లో ఓ వ్యక్తిని దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు.
హైదరాబాద్: నగరంలో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 7లో ఓ వ్యక్తిని దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు. సెటిల్మెంట్ కోసం వచ్చిన దుండగులు.. ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హంతకులు బైక్‌పై వచ్చినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నిందితుల కోసం గాలింపు చేపట్టామని, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. కాగా, మృతుడి వివరాలు తెలియరాలేదు. ఈ విషయమై పోలీసులు స్థానికులను ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications