భార్యను గొంతుకోసి, ఉరేసుకొన్నాడు, ఎందుకిలా..

కుటుంబ కలహల నేపథ్యంలో భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య చేసుకొన్న ఘటన సోమవారం రాత్రి హైద్రాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ బాగ్ లో చోటుచేసుకొంది.

హైదరాబాద్ :హైద్రాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో భార్య, భర్తలు చనిపోయారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. భార్యను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకొన్నాడు నిందితుడు.

కుటుంబ గొడవలతో విసిగిపోయిన భార్య, భర్తలు అర్థాంతరంగా తమ ప్రాణాలను కోల్పోయారు. హైద్రాబాద్ లోన మల్కాజిగిరిపోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ బాగ్ లో ఈ ఘటన చోటుచేసుకొంది.

a man sucide after murdered his wife

ఆనంద్ బాగ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా కృష్ణయ్య పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు.
సోమవారం రాత్రి పూట కృష్ణయ్య తన భార్య లక్ష్మిని కత్తితో గొంతు కోసి హతమార్చాడు. అయితే కుటుంబ కలహల కారణంగానే కృష్ణయ్య ఈ దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోది.

అయితే భార్యను గొంతుకోసి హత్య చేసిన తర్వాత అపార్ట్ మెంట్ లోని సెల్ టవర్ కు ఉరివేసుకొని ఆయన కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు. మల్కాజిగిరి పోలీసులు కేసునమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+