కిషన్ రెడ్డికి సన్మానం చేస్తావా... అంటూ దాడి చేసిన దుండగులు...!

కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిని సన్మానించినందుకు తనపై కొందరు వ్యక్తులు దాడి చేశారని బోరబండ ఎన్ఆర్ఆర్ పురం కు చెందిన హరీష్ పటేల్ అనే కిరాణ దుకాణం వ్యాపారీ ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గత వారం రోజుల క్రితం ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

a man was attacked for felicitation to Union Minister kishan reddy

అక్టోబర్ 25న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన మహాత్మ గాంధీ సంకల్పయాత్రలో భాగాంగా ఆయన పర్యటించారు. ఈ సంధర్బంగా హరీష్ పటేల్ కిషన్ రెడ్డిని సన్మానించారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకున్న కోంతమంది స్థానిక వీధి రౌడీలు ఆయన పర్యటన సాగించిన రెండు రోజుల తర్వాత హరీష్ పటేల్ కిరాణం దుకాణంలోకి చొరబడి హల్‌చల్ సృష్టించారు. కిషన్ రెడ్డిని సన్మానిస్తావా అంటూ హరీష్ పటేల్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు ఎస్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హరీష్ పటేల్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే హరీష్ పటేల్ పై జరిగిన దాడి రాజకీయ కోణంలో జరిగిందా లేక ఎవరైన వీధి రౌడిలు చేసిన ఘాతుకమా అనేది తేలాల్సి ఉంది. కాగా నిందుతులపై పలు సెక్షన్ల క్రింద నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+