వివాహితపై మూణ్నేళ్లుగా 7గురు రేప్: వాడుకుని యువతిని గర్భవతిని చేశారు

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్లగొండ /ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ వివాహితను బెదిరించి లైంగికదాడికి పాల్పడుతున్న ఏడుగురు యువకులపై కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ఓ మహిళ భర్త ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

స్థానిక కాలనీకి చెందిన రమణ మూడు నెలల కిందట ఆ మహిళకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. స్నేహితులు శ్రీను, వెంకటేశ్‌తోపాటు మరో నలుగురికి ఈ విషయం చెప్పాడు. వారంతా వివాహితను బెదిరించారు. మాట వినకపోతే భర్తకు, కుటుంబసభ్యులకు విషయం చెప్తామని లైంగికదాడికి పాల్పడుతూ వస్తున్నారు.

 married woman sexually assaulted

ఆ బాధను భరించలేని బాధితురాలు శుక్రవారం భర్తకు విషయం చెప్పింది. దీంతో నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

యువతిని గర్భవతిని చేసిన నలుగురు అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లాలో యువతిని లైంగికదాడి చేసిన నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం తాండూర్ సీఐ కరుణాకర్ అందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని, ఆరు నెలల కిందట రఘు, కార్తీక్, మల్లేశ్, రజనీకాంత్ బెదిరించి లొంగదీసుకుని లైంగికదాడి చేస్తున్నారు.

ఇటీవల యువతి కడుపునొప్పితో బాధపడగా, తల్లిదండ్రలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐదు నెలల గర్భవతిగా తేలడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టుచేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A gang has sexually assaultong a married woman at Nalgonda of Telangana for last three months

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి