క్షణిక సుఖం కోసం పిల్లల్ని నడి రోడ్డుపై వదిలేసిన తల్లి..! గుండెలు పిండేస్తున్న చిన్నారుల కథ..

క్షణిక సుఖం కోసం ఓ మహిళ తల్లి ప్రేమను ఫణంగా పెట్టింది. కన్న పిల్లల్ని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది. నాన్న ఎప్పుడో వెళ్లిపోయాడు.. కంటిన రెప్పలా చేసుకునే అమ్మ విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో ఆ పిల్లలు ఏం చేయాలో తెలియక రోడ్డుపై అమాయకంగా ఉన్న దారుణ ఘటన యూదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఈ నెల 15న యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద, ఆ తర్వాత బస్టాండ్‌ వద్ద ముగ్గురు 8,7,5 ఏళ్ల చిన్నారులు అనుమానాస్పదస్థితిలో తిరుగుతున్నారు.

సరూర్‌నగర్‌ నగర్

సరూర్‌నగర్‌ నగర్

అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు పిల్లలను గమనించారు. దగ్గరకు వెళ్లి ఆరా తీసి, తప్పిపోయిన పిల్లలుగా భావించి యాదగిరిగుట్ట ఠాణాలో ఉంచారు. ఎస్సై పిల్లలను మీది ఏ ఊరు అని ప్రశ్నించగా.. తమది రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌, భగత్‌సింగ్‌ కాలనీ చెప్పారు. ఎస్సై వెంటనే సరూర్‌నగర్‌ నగర్ సమాచారం ఇవ్వగా.. అక్కడ ఎవరు లేరని తేలిసింది.

పెద్ద నాన్న

పెద్ద నాన్న

స్థానికులను వాకాబు చేయగా.. పిల్లల తల్లిదండ్రుల గురించి చెప్పారు. వారిది ప్రేమ వివాహమని.. తండ్రి వారిని వదిలేసి వెళ్లగా.. తల్లి అటో డ్రైవర్ తో సహజీవనం చేస్తుందని తెలిపారు. పిల్లల పెద్ద నాన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అతనికి సమాచారం ఇచ్చారు. అతను వచ్చి తన తమ్ముడు పిల్లలేనని గుర్తించాడు. కానీ తనతో తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో పిల్లలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

అస్సలు ఏం జరిగింది

అస్సలు ఏం జరిగింది

రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్​లోని భగత్​సింగ్ నగర్​కు చెందిన బాబురావు, లక్ష్మి ఇద్దరు పన్నెండేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి 10, 5, 2 ఏళ్ల వయసుగల ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడేళ్ల క్రితం బాబురావు వీరిని వదిలేసిపోయాడు. ఈ క్రమంలో లక్ష్మి ఓ ఆటో డ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

చేతులు కట్టేసి

చేతులు కట్టేసి

వారికి పాప కూడా పుట్టినట్లు తెలిసింది. అయితే ఈ పిల్లలు తమ కాపురానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలతో కలిసి ఆటోలో ఈ నెల 14న అర్ధరాత్రి యాదాగిరిగట్టకు చేరుకున్నారు. పిల్లల చేతులను తాళ్లతో కట్టేసి, నోట్లు గుడ్డులు కుక్కి విడిచి వెళ్లిపోయారు. కొండ కింద అక్కడే ముగ్గురు పిల్లలు చలిలో వణుకుతూ ఉదయం వరకు అక్కడే ఉన్నారు. అక్కడికి వచ్చే భక్తలను యాచించి కడుపు నింపుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+