చేపలవేటకు వెళ్లిన వ్యక్తిని కాటేసిన కరెంట్ షాక్
వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండల శివారులోని పాఖాల వాగులో రాత్రిపూట చెపలవేటకు వెళ్ళి అదే విద్యుత్ షాక్ కు ఓ వ్యక్తి బలైన ఘటన చోటు చేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మహబాద్ యన్ హెచ్363 జాతీయ రహదారిపై ఖానాపురం సమీపంలోని పాఖాల వాగులో రాత్రి చేపలు పట్టెందుకు నర్సంపేటకు చెందిన మైసి యోహన్ అనే వ్యక్తి వృత్తిరిత్యా పేయింటర్ , తన స్నేహితులతో విద్యుత్తుతో చేపలుపట్టె విదానంలో చేపలు పట్టెందుకు వెళ్ళారు.
చేపలు పట్టెందుకు విద్యుత్తు తీగను సవరిస్తున్న క్రమంలో మైసి యోహన్ అనే వ్యక్తి వాగులో కరెంట్ సరఫరా చేసే తీగతగిలి అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో బయపడిన అతని స్నేహితులు నర్సంపేట పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనాస్థలానివెళ్ళి పంచనామూ నిర్వహించి పోస్టుమార్ధంకు తరలించారు. కేసు దర్యాపు చేసి వివరాలు తెలుపుతామని యస్ఐ హరికృష్ణ తెలిపారు.












Click it and Unblock the Notifications