Viral Video: చెప్పినా వినకుండా వెళ్లాడు.. మధ్యలో చిక్కుకుపోయాడు.. ఆ తర్వాత ఏమైదంటే..
భారీ వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండిపోయాయి. దీంతో జలాశయాల గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలారు. మంగళవారం హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు వంతెన పై నుంచి వరద నీటిలో బైక్ పై వంతెన దాటడానికి ప్రయత్నించి నీటిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని స్థానిక ట్రాఫిక్ పోలీసులు వెంటనే అతన్ని కాపాడారు.

4 గేట్లను 2 అడుగుల మేర..
ఇందుకు సంభందించిన వీడియో పోలీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జులై 26న హిమాయత్ సాగర్ జలాశయం 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. దీంతో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో టీఎస్‌పీఏ నుంచి రాజేంద్ర నగర్‌కు వెళ్లే సర్వీస్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి.

మధ్యలోకి వచ్చి ఆగిపోయాడు..
సాయంత్రం 4:45 గంటల సమయంలో ఒకరు బైక్‌పై కలీజ్ ఖాన్ దర్గా నుంచి శంషాబాద్ వైపు వెళ్లాడు. మధ్యలో హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్ వంతెనను బారికేడ్లు ఉన్నప్పటికీ దాటేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే వర్షపు నీరు వంతెనెపైకి భారీగా చేరిడంతో అతను మధ్యలోకి వచ్చి ఆగిపోయాడు. అతన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తాడు సహాయంతో..
రాజేంద్రనగర్ ట్రాఫిక్ పొలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బేగ్ నేతృత్వంలోని రికవరీ వ్యాన్ బృందం వెంటనే వంతెన పైకి చేరుకుంది. వరద నీటిలో కొట్టుకుపోతుఉన్న బాధితుడికి తాడు అందించారు. అతడు తాడుని బైక్ కు కట్టి అదే తాడు సహాయంతో వ్యాన్ ఎక్కాడు. అతన్ని అతని బండిని పోలీసులు సురక్షితంగా రోడ్డుపైకి తీసుకొచ్చారు.

అభినందనలు
దీంతో హెడ్ కానిస్టేబుల్ బేగ్ బృందాన్ని అందరు ప్రశంసించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వారని అభినందించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications