ప్రభుత్వ పాఠశాలల కోసం నేతల ర్యాలీ(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలను కఠినతరం చేసి ప్రభుత్వ పాఠశాలల విద్యను పటిష్ఠం చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యా పోరాట యాత్ర తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రైవేటు విద్యా వ్యవస్థను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ చాదర్‌ఘాట్ చౌరస్తా నుంచి నిజాం కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో పాల్గొన్న వరవరరావు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు గుర్తింపు పొందేలా అభివృద్ధి చేసి విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
పిఓడబ్ల్యూ సంధ్య మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను, కళాశాలలను రద్దు చేసి కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ, టిపిటిఎఫ్, డిటిఎఫ్, టిఆర్‌టిఎఫ్, టివివి, పిడిఎస్‌యూ, పివైఎల్, డిఎస్‌యు తదితర సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

ర్యాలీ
ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలను కఠినతరం చేసి ప్రభుత్వ పాఠశాలల విద్యను పటిష్ఠం చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు.

ర్యాలీ
అఖిల భారత విద్యా పోరాట యాత్ర తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రైవేటు విద్యా వ్యవస్థను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ చాదర్‌ఘాట్ చౌరస్తా నుంచి నిజాం కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ
ఈ ర్యాలీలో పాల్గొన్న వరవరరావు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు గుర్తింపు పొందేలా అభివృద్ధి చేసి విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

ర్యాలీ
ఈ ర్యాలీలో సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ, పిఓడబ్ల్యూ సంధ్య, టిపిటిఎఫ్, డిటిఎఫ్, టిఆర్‌టిఎఫ్, టివివి, పిడిఎస్‌యూ, పివైఎల్, డిఎస్‌యు తదితర సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications