మహిళలు ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చీరల పండుగ..చీర కావాలంటే ఇలా చెయ్యండి!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడత గ్రామీణ ప్రాంతాలలో ఆ తర్వాత రెండవ విడతలో పట్టణ ప్రాంతాలలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తారు. ఇక ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అందరికీ తెలిసేలా అట్టహాసంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలతో ప్రతి నియోజకవర్గంలోనూ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది మహిళలకు చీరల పంపకం
ఈ చీరల పంపిణీకి సంబంధించిన ప్రక్రియ కోసం పెన్షనర్ల ఫేషియల్ రికగ్నైజేషన్ కోసం వినియోగిస్తున్న యాప్ ను వినియోగిస్తున్నారు. అందులో మహిళా సంఘాల సభ్యుల ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి చీరలను అందిస్తున్నారు. అంతేకాదు చీరలను తీసుకుంటున్న ఫోటోలను కూడా అందులో పొందుపరచాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది మహిళలకు ఈ చీరల పంపకం ద్వారా ప్రయోజనాన్ని చేకూర్చాలని భావిస్తున్న ప్రభుత్వం పారదర్శకంగా చీరలపంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించింది.

A saree festival for Telangana shg women If you want a saree this is a must

మహిళాసభ్యులు కానివారికి కూడా చీరల పంపిణీ
ఇందిరమ్మ చీరలు పొందడానికి మహిళల వయసు 18సంవత్సరాలు నిండి ఉండాలని, ఆధార్ కార్డును ప్రమాణికంగా తీసుకుని చీరలను ఇస్తారని పేర్కొంది. ఇక ఈ పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నదనే విషయాన్ని ప్రజలందరికి తెలియజేయాలని భావిస్తోంది. అయితే మహిళాసభ్యులకు మాత్రమే ఈ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించిన క్రమంలో, మహిళాసభ్యులు కానివారికి కూడా చీరలను పంపిణీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

ఆడబిడ్డలందరికీ చీరలు
ఎవరైతే మహిళా సంఘాలలో సభ్యులు కారో వారికి కూడా చీరలు ఇవ్వాలంటే వారి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న తర్వాత వారికి చీరలను అందజేస్తారు. ప్రతి మండలంలో సబ్ కలెక్టర్, ఆర్డీవోలు ఇందిరమ్మ చీరలపంపిణీ కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారులుగా ఉంటారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు చీరలను అందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రజాప్రభుత్వం ఆడబిడ్డలు అందరికీ సారెను అందించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.

చీరలు కావాలంటే ఇది తప్పనిసరి
అన్ని జిల్లాలలో, మండల కేంద్రాలలో స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ నిర్దేశించిన గడువులోగా విడతలవారీగా పంపిణీని పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. డిసెంబర్ 9వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాలలో కొనసాగే ఈ కార్యక్రమం, పట్టణ ప్రాంతాల మహిళలకు మార్చి ఒకటవ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు కొనసాగుతుంది. రేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా ఆధార్ కార్డు తోనే అందరికీ చీరలను ఇవ్వనున్నారు. అయితే చీరలు కావాలంటే మహిళా సంఘాల సభ్యులు కావడం అనేది తప్పనిసరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+