కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట
హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా, ఈ వ్యవహారంలో కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయవద్దన్న ఉత్తర్వులను డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కేటీఆర్ దాఖు చేసిన క్యాష్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారించింది.
ఈ క్రమంలో హైకోర్టు ఆదేశం మేరకు ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కౌంటర్‌పై కేటీఆర్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.

శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికౌంటర్ దాఖలు చేశారా? అని కోర్టు ప్రశ్నించింది. ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్‌నే దాన కిశోర్ కౌంటర్‌గా పరిగణలోకి తీసుకోవాలా? అని అదనపు అడ్వకేట్ జనరల్ ను కోర్టు ప్రశ్నించింది. దీంతో కౌంటర్ పై నిర్ణయాన్ని తెలిపేందుకు అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి సమయం కోరారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 30వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ జారీ చేసిన ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరడంతో న్యాయమూర్తి అంగీకరించి 31వ తేదీ వరకు పొడిగించారు. తదుపరి విచారణను కూడా హైకోర్టు ధర్మాసనం అదే తేదీ వరకు విచారణను కూడా వాయిదా వేసింది. కాగా, కేటీఆర్ వేసిన క్యాష్ పిటిషన్ పై డిసెంబర్ 20న హైకర్టులో విచారణ జరిగింది. అప్పుడు హైకోర్టు ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.












Click it and Unblock the Notifications